Advertisementt

'అర్జున్ రెడ్డి' తర్వాత ఈ హీరోతోనే..!

Mon 28th Aug 2017 01:27 PM
arjun reddy,sharwanand,sandeep reddy,radha  'అర్జున్ రెడ్డి' తర్వాత ఈ హీరోతోనే..!
Arjun Reddy Director to work with Sharwanand 'అర్జున్ రెడ్డి' తర్వాత ఈ హీరోతోనే..!
Advertisement
Ads by CJ

'అర్జున్ రెడ్డి' సినిమాని యూత్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించి హిట్ కొట్టిన డైరెక్టర్ సందీప్ వంగా ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్క సినిమా హిట్ తో ఓవర్ నైట్ లో స్టార్  డైరెక్టర్ గా అవతరించేశాడు. సినిమా విడుదలకు ముందు నుండే ఈ డైరెక్టర్ కి 'అర్జున్ రెడ్డి' మీద పూర్తి నమ్మకం ఉంది. తమ సినిమా గ్యారెంటీగా హిట్ కొడుతుందని.... ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా హిట్ తో ఒక్కసారే స్టార్ హీరో రేంజ్ కి పేరు సంపాదించేశాడు. 'అర్జున్ రెడ్డి' సినిమా టీజర్, ట్రైలర్ తోనే సినిమా మీద నెగెటివ్ ఇంప్రెషన్ పడేలా చేసుకుంది. కారణం సినిమాలో ఎక్కువగా బూతు డైలాగ్స్, కిస్సింగ్ సీన్స్ ఉండడమే.

అసలు ఆ లిప్ లాక్ కిస్సుల పోస్టర్స్ అయితే పెద్ద ప్రకంపనలే సృష్టించాయి కూడా. ఏది ఏమైనా ఈ సినిమా నెగెటివ్ పబ్లిసిటీతో బాగా ఆకట్టుకుని సినిమా విడుదలయ్యే వరకు కాంట్రవర్సీలతోనే ఉంది. సినిమా విడుదలయ్యాక మాత్రం పాజిటివ్ టాక్ తో సినిమా సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే సినిమాని సూపర్ స్టైలిష్ గా, యువతకు దగ్గరగా ఉండేలా సినిమాని తెరకెక్కించిన సందీప్ వంగాకి అప్పుడే నెక్స్ట్ ప్రాజెక్ట్  హీరో దొరికేశాడు. ఈ ఏడాది 'శతమానంభవతి' తో హిట్ కొట్టి, 'రాధ'తో డిజప్పాయింట్ అయినా ఇప్పుడు తాజాగా మారుతి డైరెక్షన్ లో 'మహానుభావుడు'తో అలరించడానికి వస్తున్న శర్వానందే.. సందీప్ నెక్స్ట్ సినిమా హీరోనట.

సందీప్ వంగా నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయేది శర్వానంద్. ఇక ఈ సినిమా కూడా సందీప్ హోమ్ బ్యానర్ భద్రకాళి ఫిలిమ్స్ నిర్మాణంలోనే ఉంటుందంటున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం వుంది. అదేమిటంటే 'అర్జున్ రెడ్డి' స్క్రిప్ట్ ముందు శర్వా దగ్గరకే వెళ్లిందట. కానీ కొన్ని కారణాల వలన శర్వా ఆ సినిమాలో నటించలేకపోయాడట. మరి శర్వాకి సందీప్ వంగా అప్పుడు మిస్ అయినా ఇప్పుడు దొరికాడన్నమాట.

Arjun Reddy Director to work with Sharwanand:

Buzz in the Filmnagar says that young hero Sharwanand will be starring in Sandeep's next. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ