Advertisementt

పవన్ - త్రివిక్రమ్ కాంబో కదా! ఈ రికార్డ్స్ కామనే!

Sun 27th Aug 2017 10:52 PM
pawan kalyan,trivikram srinivas,overseas rights,power star pawan kalyan  పవన్ - త్రివిక్రమ్ కాంబో కదా! ఈ రికార్డ్స్ కామనే!
Pawan and Trivikram Movie Overseas Record పవన్ - త్రివిక్రమ్ కాంబో కదా! ఈ రికార్డ్స్ కామనే!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందంటున్నారు. మళ్ళీ కాలేదంటున్నారు. అలాగే ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయికి అమ్ముడు పోయాయంటున్నారు. కానీ కాలేదంటున్నారు. ఇక వీరి కాంబోలో వస్తున్న సినిమాపై విపరీతమైన అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 2 న పవన్ బర్త్ డే కానుకగా విడుదల చెయ్యబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే  ఈ సినిమాపై భారీ అంచనాలున్న మాట నిజమే గాని ఇప్పటివరకు బిజినెస్ విషయంలో ఇంకా అనుమానాలున్నాయంటున్నారు. ఇంతకుముందే రికార్డు రేటుకు ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోయాయని చెప్పారు గాని, అసలు ఇప్పుడే ఓవర్సీస్ హక్కులు బేరాలు జరుగుతున్నట్టు వార్తలోస్తున్నాయి.

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాలు రెండూ ఓవర్సీస్ లో కోట్లు కొల్లగొట్టడంతో ఇప్పుడు వచ్చే మూడో సినిమా కూడా రికార్డు స్థాయిలో హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే పవన్ సినిమాకి కనివిని ఎరుగని రీతిలో ఓవర్సీస్ హక్కులు అమ్ముడు పోయినట్లు చెబుతున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ముందుగా అనుకున్నట్టే హారిక, హాసిని క్రియేషన్స్ వారు ఏకంగా 20  కోట్లకి అమ్మేసినట్లు తెలుస్తుంది.. అయితే ఇక్కడ 'స్పైడర్' సినిమా కూడా ఓవర్సీస్ లో దాదాపు 23  కోట్లకు అమ్ముడయ్యింది. మరి 'స్పైడర్' తో పోల్చుకుంటే దాదాపు 3 కోట్లు తక్కువే. అయితే ఇక్కడ 'స్పైడర్' తెలుగు, తమిళం రెండు హక్కులను 23 కోట్లకి అమ్మితే పవన్ ఒక్క తెలుగు రైట్స్ కే 20 కోట్లు వచ్చాయి. 

మరి ఈ లెక్కన పవన్ సినిమా ఓవర్సీస్ లో రికార్డు సృష్టించినట్లే.  పవన్ కి ఓవర్సీస్ లో ఉన్న క్రేజ్ చూస్తుంటే మాత్రం అమ్మో అనిపిస్తుంది. ఇక 20 కోట్లకి వారు కొన్నారంటే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవాలంటే మాత్రం 4.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చెయ్యాల్సి ఉంటుంది. మరి ఇంతటి భారీ ధర పవన్ - త్రివిక్రమ్ సినిమాకి వచ్చింది అంటే పవన్ కి, త్రివిక్రమ్ ఉన్న ఓవర్సీస్ క్రేజ్ కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. 

Pawan and Trivikram Movie Overseas Record:

Pawan Kalyan and Trivikram Srinivas combo film overseas rights sold out.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ