Advertisementt

151 కాదు 1: రాజమౌళి కాంప్లిమెంటా..కౌంటరా!

Sun 27th Aug 2017 05:39 PM
ss rajamouli,sye raa narasimha reddy,ram charan,controversy on rajamouli speech  151 కాదు 1: రాజమౌళి కాంప్లిమెంటా..కౌంటరా!
Controversy on Rajamouli Speech at Sye Raa Motion Poster Launch 151 కాదు 1: రాజమౌళి కాంప్లిమెంటా..కౌంటరా!
Advertisement
Ads by CJ

చిరంజీవి బర్త్ డే పురస్కరించుకుని, చిరు 151 చిత్రం 'సై రా నరసింహా రెడ్డి' చిత్ర టైటిల్ ని, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు నిర్మాత రామ్ చరణ్. తనకు మగధీర వంటి సినిమాను ఇచ్చిన గౌరవం ఒకవైపు, బాహుబలి వంటి చిత్రంతో ప్రపంచానికే సెలబ్రిటీ అయిన రాజమౌళి తో పోస్టర్ రిలీజ్ చేయిస్తే వచ్చే కమర్షియల్ పబ్లిసిటీ మరో వైపు వెరసి దర్శకధీరుడు రాజమౌళి తో మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయించాడు రామ్ చరణ్. ఇది అందరికి తెలిసిన విషయమే. 

అయితే రాజమౌళి కి మెగా ఫ్యామిలీ అంటే కాస్త చిన్న చూపు ఉందనే విషయం ఈగని పెట్టి ఆయన సినిమా తీసిన సమయంలోనే వార్తలు వచ్చాయి. మగధీర టైం లో రాజమౌళి ని మెగా ఫ్యామిలీ చాలా హీనంగా చూడటం వల్లే..రాజమౌళి మెగా ఫ్యామిలీ కి బుద్ది చెప్పాలని భావించాడని, ఆ కసితోనే ఈరోజు రాజమౌళి ప్రపంచ స్థాయి గుర్తింపుని పొందాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకునే విషయం. రాజమౌళి చేసే ట్వీట్ లు కూడా దీనికి ఊతం ఇస్తున్నాయి. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలపై చిన్న కామెంట్ కూడా చేయని రాజమౌళి, ఇండస్ట్రీలో తనకి ఇష్టమైన (క్యాస్ట్ పరంగా కూడా) వారి సినిమాలు, రిలీజ్ అయితే మాత్రం, ఏదో ఒక రూపంలో ట్విట్ చేస్తుంటాడు. ఇంకా తనకిష్టమైన హీరోల సినిమాలు కూడా బెనిఫిట్ షో లు కూడా చూస్తుంటాడు. వారి సినిమాలను తన సినిమాలుగా భావించి ప్రచారం చేస్తుంటాడు. దీనికి ఉదాహరణ ఫిదా సినిమానే. 

ఇక విషయంలోకి వస్తే..'సై రా నరసింహా రెడ్డి' మోషన్ పోస్టర్ తర్వాత రాజమౌళి మాట్లాడుతూ..అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, ఏ.ఆర్. రెహ్మాన్ వంటి దిగ్గజాలు ఈ సినిమాకి పనిచేయడం చూస్తుంటే ఇది చిరంజీవి గారి 151 వ చిత్రం లా లేదని, తొలి అంటే డెబ్యూట్ చిత్రంలా ఉందని మాట్లాడాడు.  అయితే ఇది రాజమౌళి ఇచ్చింది కాంప్లిమెంటా!..కౌంటరా! అనేది తెలియలేదు మెగా అభిమానులకు. మెగాస్టార్ లాంటి హీరోకి ఇంత ప్యాడింగా..అని కౌంటర్ వేసినట్లు ఉందని మెగా అభిమానులు కొందరు భావిస్తుండటం విశేషం. రాజమౌళి ఏ ఉద్దేశ్యంతో ఇలా అన్నాడో గానీ, దీనిపై ఇప్పుడిప్పుడే అగ్గి రాజుకుంటుంది. చూద్దాం మున్ముందు ఇది ఎంతవరకు వెళుతుందో? అయితే ఇది తనకు దక్కిన గౌరవం గా భావిస్తున్నా అని ట్వీట్ కూడా చేయడంతో మెగా అభిమానులు దీనిని లైట్ గానే తీసుకుంటారని భావిద్దాం. 

Controversy on Rajamouli Speech at Sye Raa Motion Poster Launch:

SS Rajamouli Speech Highlights at Sye Raa Function

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ