తమ అభిమాన హీరోల బర్త్ డే వస్తుంది అంటే చాలు..తమ అభిమానం ఏదో రకంగా చూపించాలని అభిమానులు తాపత్రయ పడుతుంటారు. బ్లడ్ డొనేషన్, ఫుడ్ డొనేషన్, వస్త్ర దానం ఇలా ఏదో ఒక రూపంలో తమ అభిమాన హీరోపై అభిమానం చాటుకుంటారు. ఆ వుడ్, ఈ వుడ్ అనే భేదం లేకుండా సినిమాకి సంబంధించిన అన్ని వుడ్ లలో తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ లపై ఈ విధంగానే అభిమానం ను వ్యక్తపరుస్తున్నారు.
హీరోలు కూడా తమ బర్త్ డే కి తమ అభిమానులు తమ నుండి ఏదో ఒకటి ఆశిస్తారని, వాళ్ళు చేస్తున్న సినిమాలలోని ఏదో ఒకటి స్పెషల్ గా రిలీజ్ చేసి తమ అభిమానులను ఆనందపరుస్తారు. అభిమానం అక్కడక్కడా శృతి మించితే తప్ప, అభిమానులు, హీరోల మధ్య మాత్రం మాక్సిమమ్ ఇలాంటి బంధమే ఉంటుంది.
తాజాగా ఆగస్ట్ 29 కింగ్ నాగార్జున పుట్టినరోజు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వచ్చేస్తుందని భావించిన ఓ అభిమాని కొత్తగా అలోచించి..నాగ్ నటించిన చిత్రాల లోని అన్ని పాత్రలతో ఓ పోస్టర్ని తయారు చేసి సోషల్ మీడియా లో వదిలాడు. ఇప్పుడు ఈ పోస్టర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది.