ఒక హీరో, మరో దర్శకునితో కలిసి హిట్ కొడితే తదుపరి అదే కాంబినేషన్‌లో వచ్చే చిత్రంపై మంచి అంచనాలే ఉంటాయి. కారణం, ఆ డైరెక్టర్ డైరెక్షన్ చేసే విధానంపై ఆ హీరోకి సరైన అవగాహన ఉండటం, ఇక ఆ చిత్రంలో నటించే హీరో మైనన్‌లు, ప్లస్‌లు ఆ డైరెక్టర్‌గా బాగా తెలియడం వల్ల హిట్ పెయిర్ అనేదానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఇక హీరో- హీరోయిన్ల విషయంలో కూడా వారిద్దరిది హిట్ పెయిర్ అయి ఉంటే ఆ జంటకు కూడా సినిమా షూటింగ్‌లో మంచి అవగాహన ఉంటుందని సమంత చెబుతోంది.
ఓ సారి ఓ హీరోతో నటించిన తర్వాత ఈ చిత్రం హిట్టయితే తదుపరి చిత్రంలో కూడా ఆయా హీరోలతోనే చేసినందువల్ల ఆ హీరో ప్లస్‌లు, మైనస్‌లపై హీరోయిన్లకు, హీరోయిన్ల గురించి ఆయాహీరోలకు మంచి అండర్‌స్టాడింగ్ ఉంటుందని సమంత అంటోంది. ఏ సీన్‌లో ఏ హీరో ఎలా నటిస్తాడనేది ముందుగానే ఓ అంచనా ఉండటంతో ఆయా హీరోయిన్లు దానిని సులువుగా అర్ధం చేసుకుని ఆ హీరోలకు తగిన విధంగా టైమింగ్‌ను, యాక్టింగ్‌ను మార్చుకునే సౌలభ్యం తమకు కూడా ఉంటుందని, దానిని దృష్టిలో పెట్టుకునే ఆడియన్స్ కూడా హిట్ పెయిర్ అంటే ఆసక్తి చూపుతారని, అది అభిమానులకే కాదు.. తమకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతోంది.
తాను నాగచైతన్య, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లతో ఎక్కువసార్లు జోడీ కట్టినందువల్ల వారి యాక్టింగ్ స్కిల్స్ తనకు తెలుసు కాబట్టి వారి సరసన నటించడం ఎంతో ఈజీగా అనిపిస్తుందని చెబుతోంది. ఈ పాయింట్ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమేనని, వాలిడ్ పాయింటే అనిపిస్తోంది.