సాధారణంగా ఏడాదికి ఎంత బిజీ స్టార్‌గా ఉన్నా రెండు మూడు చిత్రాలు చేసే హీరో విక్టరీ వెంకటేష్, స్టార్‌లందరిలో మినిమం గ్యారంటీ హీరోగానే గాక, మంచి రీమేక్ చిత్రాల హీరోగా కూడా ఈయనకు మంచి పేరుంది. కానీ ఆయన ఇటీవల హిందీ 'సాలా ఖద్దూస్'కి రీమేక్‌గా చేసిన 'గురు' చిత్రం బాగానే ఆడినా ఇప్పటి వరకు తన తదుపరి చిత్రం గురించి ప్రకటన చేయలేదు. మొదట 'నేను..శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమలతో 'ఆడాళ్లు మీకు జోహార్లు' అని ప్రకటించాడు. ఈ చిత్రం పట్టాలెక్కలేదు.
అంతలో బాలయ్య కంటే ముందే పూరీ జగన్నాథ్ ఓ కథతో వెంకీని కలిశాడు. కానీ ఈ చిత్రం బడ్జెట్ తన మార్కెట్ కంటే భారీగా ఉండటంతో నో చెప్పాడని వార్తలు వచ్చాయి. పూరీ.. బాలయ్యతో చేసిన 'పైసా వసూల్' తర్వాత ఆ చిత్రం రిజల్ట్ చూసుకుని పూరీతో చిత్రం చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. ఇక రీమేక్‌ల వెంటపడే ఈ హీరో కథ ఎంతో వైవిధ్యంగా ఉన్న మాధవన్, విజయ్‌సేతుపతిల కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రమ్ వేద'కి గ్రీన్‌సిగ్నల్ ఇస్తాడని చాలా మంది భావించారు. అందులోని పాత్రలు కూడా బాబాయ్ వెంకీకి, అబ్బాయ్ రానాకి బాగా సూటయ్యేవే అయినా ఎందుకో వెంకీ ఓకే చేయకపోవడంతో ప్రాజెక్ట్ నాగార్జున వద్దకు వెళ్లిందంటున్నారు.
కాగా హీరోగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఇష్టపడే వెంకటేష్ వద్దకు ఇప్పుడు ఓ పౌరాణిక చిత్రం ఆఫర్ వచ్చిదంటున్నారు. 'రుద్రమదేవి' తర్వాత తన స్వీయనిర్మాణం, దర్శకత్వంలో గుణశేఖర్ 'హిరణ్యకస్యప' అనే స్టోరీని సినిమాగా తీయనున్నాడు. హిరణ్యకస్యపుని కోణంలో జరిగే కథ ఇది. ఇందులో టైటిల్ రోల్ అయిన హిరణ్యకస్యపని చేయమని గుణశేఖర్.. వెంకీని కోరి, ఆయనకు కథ కూడా నెరేట్ చేశాడట.
తాను చేయని పౌరాణిక జోనర్ కావడంతో దీనికి వెంకీ కూడా సానుకూలంగానే స్పందించాడని అంటున్నారు. ఇక క్రిష్ దర్శకత్వం వహించిన దగ్గుబాటి రానా 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రంలో నరసింహాస్వామి ఉగ్రరూపంతో కనిపించి, హిరణ్యకస్యపుడిని అంత మొందిస్తాడు. ఇప్పుడు ఈ హిరణ్యకస్యపుని పాత్రలో వెంకీ నటించనున్నాడు. ఇక ఇందులో రానా కూడా నరసింహస్వామిగా మరోసారి నటిస్తే ఈ బాబాయ్-అబ్బాయ్‌లు తమ దగ్గుబాటి ఫ్యాన్స్ కోరికను తీర్చినట్లు అవుతుంది.