Advertisementt

మేకింగ్ ఈ రేంజ్ లో ఉంటే..ఇంక సినిమా..?

Sat 26th Aug 2017 08:24 PM
rajinikanth,2.0 movie,2.0 making video,shankar director,robot  మేకింగ్ ఈ రేంజ్ లో ఉంటే..ఇంక సినిమా..?
2.0 Making Video Released మేకింగ్ ఈ రేంజ్ లో ఉంటే..ఇంక సినిమా..?
Advertisement
Ads by CJ

శంకర్ పేరు చెబితే సౌత్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. శంకర్ సినిమా వస్తుంది అంటే అందరి చూపు దాని మీదే ఉంటుంది. ఎలాంటి భారీ తనంతో సినిమాని తెరకెక్కిస్తున్నాడో చూద్దాం అనే ఉత్సుకత అందరిలో కలుగుతుంది. ఆయన సినిమాలు ఎక్కువగా ప్లాప్స్ అయినప్పటికీ  ఆయన మేకింగ్ స్టైల్ కి అందరూ పడిపోతారు. ఆ రేంజ్ లో శంకర్ మేకింగ్ స్టైల్ ఉంటుంది. రోబో చిత్రంలోనే కాదు శంకర్ చిత్రాలన్నిటిలో మేకింగ్ గురించి ప్రత్యేకంగా ముచ్చటించుకుంటారు. ఆ లెవల్లో మేకింగ్ ని అదరగొడతాడు శంకర్. ఇప్పుడు రజినీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.0 మేకింగ్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతుందని ఒక శాంపిల్ వదిలారు 2.0 చిత్ర టీమ్. 

2.0 చిత్రం భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమీ జాక్సన్ అందాల విందు మరో స్పెషల్ అట్రాక్షన్ అంటూ చిత్ర టీమ్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇకపోతే ఇప్పుడు 2.0 మేకింగ్ వీడియో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. ఈ మేకింగ్ వీడియోతోనే రోబో సీక్వెల్ 2.0 ఎలా వుండబోతుందో అనేది ఈజీగా అర్ధమయ్యేలా చేశాడు శంకర్. 2.0 చిత్రం వచ్చే ఏడాది విడుదలవుతున్నప్పటికీ... ఇప్పుడు ఈ మేకింగ్ వీడియోని విడుదల చేసి ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు చిత్ర యూనిట్.

ఇక ఈ మేకింగ్ వీడియోలో భారీ యాక్షన్ సన్నివేశాలు, హాలీవుడ్ రేంజ్ లో పెద్ద పెద్ద కట్టడాలు, రోడ్లు.. ఇలా ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో ఉంటుందో... పరిచయం చేశాడు. శంకర్ సినిమాల్లో భారీ సెట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనకి ముందే తెలుసు. అంతకంటే ఎక్కువ స్థాయిలో 2.0 సెట్స్ కూడా కనబడుతున్నాయి. కానీ అవి సెట్స్ అంటే నమ్మబుద్ది కాకుండా రియల్ అనిపించేలా కనబడుతున్నాయి. అలాగే భారీ స్థాయిలో జూనియర్ ఆర్టిస్ట్ లను కూడా ఈ సినిమా కోసం వాడాడనే విషయం పూర్తిగా అర్ధమవుతుంది ఈ మేకింగ్ లో. ఇక రజినీకాంత్, విలన్ అక్షయ కుమార్ ల మేకప్స్ చూస్తుంటే మాత్రం ఔరా అనాల్సిందే. ఆ స్థాయిలో వారి మేకప్ వుంది. మరి ఈ మేకింగ్ వీడియో చూసిన రజిని అభిమానులు మాత్రమే కాదు ఇండియా మొత్తం శంకర్ మేకింగ్ స్టైల్ ని తారా స్థాయిలో కొనియాడుతున్నారంటే నమ్మండి.

Click Here to See the Making Video

2.0 Making Video Released:

Rajinikanth, Akshay Kumar and Director Shankar Movie 2.0 Making Video Sensation