Advertisementt

అర్జున్ రెడ్డిని ఇండైరెక్ట్ గా భలే వాయించాడు!

Fri 25th Aug 2017 05:00 PM
devi prasad,arjun reddy,vijay devarakonda,devi prasad counter to arjun reddy  అర్జున్ రెడ్డిని ఇండైరెక్ట్ గా భలే వాయించాడు!
Director Devi Prasad sensational comments on Arjun Reddy అర్జున్ రెడ్డిని ఇండైరెక్ట్ గా భలే వాయించాడు!
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో ఎందరో..  డైరెక్టర్స్ వచ్చి పోతుంటారు. సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. ఫట్ అయితే కనుమరుగైపోతారు. మరికొంతమంది అవకాశాలకోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ కోవకి చెందిన ఒక డైరెక్టర్ ఇప్పుడు అనుకోకుండా వార్తల్లోకొచ్చేశాడు. 'లీలామహల్ సెంటర్, దట్ ఈజ్ పండు, బ్లేడ్ బాబ్జీ, మిస్టర్ పెళ్లికొడుకు' వంటి చిత్రాల దర్శకుడు దేవీ ప్రసాద్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. అవేమిటంటే ఇప్పుడు సినిమా నటీనటులు కొంతమంది ఆడియో వేదికల మీద... కొన్ని సినిమాలకు సంబందించిన ఫంక్షన్స్ లో అసభ్యపదజాలంతో రెచ్చిపోతున్నారు.

వారు వాడుతున్న భాష చాలా అసభ్యంగా ఉందంటూ దేవీప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎవడి బాత్‌రూంలో వాడు ఎలాగైనా స్నానం చేయొచ్చు..... కానీ అందరిముందు చెరువులో స్నానం చేసేప్పుడు గోచీ అయినా లేకపోతే బాగుండదు కదా.... అంటూనే ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్ లోనేకాదు.. సినిమా ఫంక్షన్స్‌లోనూ కొందరు వాడుతున్న భాషకు గోచీ కూడా ఉండటం లేదు... అంటూ సంచలనంగా మాట్లాడాడు. మరి ఈయన మాట్లాడింది ఒక యంగ్ హీరో గురించే అంటూ ఇప్పుడు నెటిజెన్ల కామెంట్ చేస్తున్నారు.

ఈ మధ్యన విజయ్ దేవరకొండ తన సినిమా అర్జున్ రెడ్డి ప్రమోషన్ లో భాగంగా బూతు పదాలను వాడితే సెన్సార్ వాళ్ళు మ్యూట్ చేస్తున్నారని.. ఆ బూతులు వాడడంలో ఏం తప్పులేదంటూ కొంచెం ఎగస్ట్రాలే  మాట్లాడాడు. అలాగే సినిమాలో కిస్ సీన్స్ ఉంటే అభ్యంతరం ఏమిటంటూ రెచ్చిపోయాడు. అయితే ఇప్పుడు డైరెక్టర్ దేవి ప్రసాద్ మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ యంగ్ హీరోకి కౌంటర్ వేసినట్టుందంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Director Devi Prasad sensational comments on Arjun Reddy:

Devi Prasad Counter on Arjun Reddy Movie Team comments

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ