Advertisementt

'సై రా' రికార్డ్.. ఇదిగో రా..!

Thu 24th Aug 2017 04:50 PM
sye raa narasimha reddy,chiranjeevi,mega fans,mega star,ram charan,ss rajamouli,record  'సై రా' రికార్డ్.. ఇదిగో రా..!
Sye Raa Motion Poster Record in Socia Media 'సై రా' రికార్డ్.. ఇదిగో రా..!
Advertisement
Ads by CJ

ఆగష్టు 22 న చిరంజీవి బర్త్ డే కానుకగా చిరు 151 మూవీ టైటిల్ లోగో 'సై రా నరసింహారెడ్డి' తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అలాగే మహామహులు ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తున్న విషయం మోషన్ పోస్టర్ లో రివీల్ చేసింది చిత్ర యూనిట్. మరి తొమ్మిదేళ్లు రాజకీయాల్లో ఉండి, 'ఖైదీ నెంబర్ 150' అంటూ 150 వ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేసిన చిరు ఇప్పుడు తాజాగా 151 వ చిత్రాన్ని ఆఫీషియల్ గా సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయారు.

మరి చిరంజీవి సినిమా అంటేనే మెగా ఫ్యాన్స్ ఊగిపోతారు. మరి మెగా ఫ్యాన్స్ కి సినిమా టైటిల్ లాంచ్ రోజే మోషన్ పోస్టర్ ని కానుకగా ఇస్తే ఊరుకుంటారా. పండగ చేసేసుకోరు. ఇక చిరంజీవి 151 వ మూవీ లాంచ్ రోజే సెన్సేషన్ క్రియేట్ చేసి 'సై రా' చిత్రాన్ని జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చేలా ఈ మెగా ఈవెంట్ ని  ప్లాన్ చేసి, నిర్మాత రామ్ చరణ్ సక్సెస్ అయ్యాడు. మరి ఆ స్థాయిలో 'సై రా' కి క్రేజ్ తెచ్చారంటే.... మోషన్ పోస్టర్ కి ఇంకెంత క్రేజ్ వచ్చి ఉండాలి. మరి సినిమా మోషన్ పోస్టర్ తోనే చిరు మొదటిరోజే రికార్డుల వేట షురూ చేసాడు. చిరు 'సై రా నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ విడుదలైన 24 గంటల్లోనే 1.27 మిలియన్ వ్యూస్ వచ్చాయని చెబుతున్నారు. మరి ఇన్ని వ్యూస్ ఒక మోషన్ పోస్టర్ కి రావడం అంటే సామాన్యమైన  విషయం కాదు. మరి ఒక్క చిరుకే అది సాధ్యమంటూ మెగా ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటున్నారు.

మరి సినిమా టైటిల్ ని ప్రకటించిన రోజే రికార్డులు స్టార్ట్ చేసిన ఈ చిత్రంలో జగపతిబాబు, అమితాబచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, హీరోయిన్ నయనతార వంటి మహామహులు నటిస్తుండగా... ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.

Sye Raa Motion Poster Record in Socia Media :

Sye Raa Narasimha Reddy Motion Poster Sensation In Youtube

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ