ఒకప్పుడు ఎన్టీఆర్ హిట్స్ ఇచ్చిన దర్శకుల వెంట, టాప్ హీరోయిన్ల వెంట పడే వాడు. కానీ 'టెంపర్' చిత్రం నుండి ఆయన వ్యవహార శైలి బాగా మారిపోయింది. హిట్ రికార్డులు, ట్రాక్ రికార్డులను పట్టించుకోకుండా కంటెంట్‌ని, దర్శకుల టాలెంట్‌ని నమ్ముకుని 'నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్' చిత్రాలు చేశాడు. ఇక 'సర్దార్‌గబ్బర్‌సింగ్' వంటి డిజాస్టర్ తర్వాత, తన మొదటి చిత్రం రవితేజతో కేవలం యావరేజ్‌గా ఉండే 'పవర్'ని ఇచ్చిన బాబిని నమ్మి 'జై లవకుశ' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఒప్పుకునే సమయంలో ఆయన ఎందరో దర్శకులను, ఎన్నో కథలను విని ఎట్టకేలకు బాబి చిత్రానికి సై అనడంతో ఈ చిత్రంలో సమ్‌థింగ్ ఏదో స్పెషల్ ఉందని అందరూ భావిస్తున్నారు.
ఇక ఆయన హీరోయిన్ల విషయంలో కూడా పంధా మార్చుకున్నాడు. స్టార్ హీరోయిన్ల వల్ల తన చిత్రానికి అదనంగా చేకూరే లాభం ఏమీ లేదని గమనించిన ఆయన నిర్మాతలకు బడ్జెట్ బరువును తగ్గించడం కోసం 'జై లవ కుశ'లో పెద్ద స్టార్స్ కాకపోయినా నివేదాథామస్, రాఖిఖన్నాలకు అవకాశం ఇచ్చాడు. మరో హీరోయిన్‌గా మామూలు హీరోయిన్ అయిన నిత్యామీనన్‌ని తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన మెయిన్ హీరోయిన్‌గా అను ఇమ్మేన్యుల్‌ని పెట్టుకున్నాడట. త్రివిక్రమ్ హీరోయిన్ల క్యారెక్టర్లకు మంచి ఇంపార్టెంట్ రోల్స్ ఉండేలా చూసుకోవడంతో పాటు ఆయా హీరోయిన్లను ఎందో అందంగా చూపిస్తాడనే పేరుంది.
గతంలో 'జల్సా'లో నటించిన ఇలియానానే 'జులాయి'లో పెట్టుకున్నాడు. 'అత్తారింటికి దారేది'లో నటించిన సమంతనే 'అ...ఆ' చిత్రంలో పెట్టుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్‌లని పెట్టుకున్నాడు. దాంతో తాను తదుపరి దర్శకత్వం చేయబోయే ఎన్టీఆర్ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌ని మెయిన్ హీరోయిన్ పాత్రకు తీసుకున్నాడని సమాచారం.