Advertisementt

చైతూ-సమంతలకి అంత లేదంటోంది..!

Thu 24th Aug 2017 12:29 PM
amala akkineni,samantha,naga chaitanya,chaitu and sam marriage  చైతూ-సమంతలకి అంత లేదంటోంది..!
Amala Akkineni Talks About Chaitu and Samantha Marriage చైతూ-సమంతలకి అంత లేదంటోంది..!
Advertisement
Ads by CJ

నాగచైతన్య - సమంత లు త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారు. అక్టోబర్ 6 , 7 తేదీల్లో వీరు గోవాలో పెళ్ళికి రెడీ అవుతున్నారు. ఒక పక్క షూటింగ్స్ మరో పక్క పెళ్లి పనులతో ఫుల్ బిజిగా వుంది ఈ జంట. చేతినిండా సినిమాలతో బిజీగా వున్న ఈ జంట పెళ్లి తర్వాత కూడా గ్యాప్ తీసుకోకుండా సినిమా షూటింగ్స్ కి హాజరవుతామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని ఫ్యామిలీ కూడా వీరి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా వుంది. అయితే ఈ పెళ్లికి ఇండస్ట్రీలో ఎవరెవర్ని పిలుస్తున్నారనే దాని మీద జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. 

అయితే అమల అక్కినేని ఆ విషయమై క్లారిటీ ఇచ్చేసింది. నాగచైతన్య - సమంత లు పెళ్లి పనుల్లో బిజీగా వున్నారని.... షాపింగ్స్ గట్రా పనులతో తీరికలేకుండా గడుపుతున్నారని చెప్పిన అమల... చైతు - సామ్ ల పెళ్లి చాలా సింపుల్ గా జరగబోతుందని... కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి జరగబోతుందని చెబుతుంది. ఇంకా అమల....  నాగ చైతన్య - సమంతలు జంట చూడముచ్చటైందని చెప్పుకొచ్చింది. మరి పెళ్లి సింపుల్ గా చేస్తే చేశారు గాని కనీసం రిసెప్షన్ అయినా అభిమానుల మధ్యన ఇండస్ట్రీలోని ప్రముఖుల మధ్యన చేస్తారా లేదా అనేది మాత్రం చెప్పకుండా సమాధానం దాటవేసింది.

Amala Akkineni Talks About Chaitu and Samantha Marriage:

Just Simple.. No Grand Arrangements for Naga Chaitanya and Samantha Marriage 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ