ఒక సినిమా ట్రైలర్ అయినా, టీజర్ అయినా విడుదలయ్యింది అంటే అందులోని ఎంటర్టైన్మెంట్ కన్నా దానిలో ఉన్న లోపాలే ఎక్కువగా బయటికి వచ్చి నానా రచ్చ జరుగుతుంది. ఆ రచ్చ అనేది సినిమా విడుదలకు ముందే స్టార్ట్ అవుతుంది కూడా. మొన్నటికి మొన్న 'డీజే' విషయంలో బ్రాహ్మణ సంఘాలు చేసిన రచ్చ మరవకముందే ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో ఆ రచ్చ మహిళా సంఘాల నుండి స్టార్ట్ అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' చిత్రం టీజర్, ట్రైలర్ దగ్గర నుండి నెగెటివ్ టాక్ తోనే జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ సినిమాలో కొంచెం బూతు పదాలు ఎక్కువగా ఉండడం, లిప్ లాక్ కిస్సులు ఉండడంతో సెన్సార్ వాళ్ళు కూడా ఈ సినిమాకి 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు.
ఇక విజయ్ 'అర్జున్ రెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కొంచెం రచ్చ రచ్ఛగానే మాట్లాడి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.. ఇక హీరోయిన్ తో లిప్ లాక్ కిస్ లు పెడ్తున్న పోస్టర్స్ ని రెడీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల గోడలకి, సిటీ బస్సుల మీద, హోర్డింగ్స్ వేయించారు. మరి ఇలా లిప్ లాక్ కిస్సులతో ప్రమోషన్ మొదలెడితే మహిళా సంఘాలు ఎందుకూరుకుంటాయి. అందుకే ఈ 'అర్జున్ రెడ్డి' టీమ్ మీద పోలీస్ లకి కంప్లైంట్ చెయ్యడమే కాదు సినిమా విడుదల ఆపేయ్యాలంటూ రచ్చ స్టార్ట్ చేశాయి. మొన్నటికి మొన్న బస్సు మీద ఉన్న లిప్ లాక్ పోస్టర్ ని కాంగ్రెస్ నేత హనుమంతరావు గారు చించేస్తే 'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ 'తాతయ్య... చిల్' అంటూ కామెంట్ చేశాడు.
అయితే ఇప్పుడు మహిళా సంఘాల వత్తిళ్ళకి తలొగ్గిన 'అర్జున్ రెడ్డి' టీమ్ వారికి సారీ చెప్పడమే కాకుండా ఆ లిప్ లాక్ కిస్సులతో వేయించిన పోస్టర్స్ ని తీసెయ్యనున్నట్లు కూడా చెప్పారు. మరి ఎవరేమనుకున్నా మా సినిమా విషయంలో తగ్గేది లేదని.... బూతులు కూడా నిజ జీవితంలో కామన్ అయినప్పుడు సినిమాల్లో ఎందుకు వాడకూడదు...అంటూ స్పీచ్ ఇచ్చిన విజయ్ ఇప్పుడు ఈ పోస్టర్స్ విషయంలో మహిళా సంఘాల వత్తిళ్ళకి తలొగ్గి సారీ చెప్పడం చూస్తుంటే రెండు సినిమాలకే బాగా ఎక్కించుకుని మాట్లాడిన కుర్రాడికి ఇప్పుడు ఆ పొగరు కాస్త దిగిందా అనే కామెంట్స్ పడుతున్నాయ్.
ఇక సినిమాని ఇలా బూతు పదాలతో పబ్లిసిటీ చెయ్యడం వలన రేపు శుక్రవారం విడుదల కాబోతున్న 'అర్జున్ రెడ్డి' కి ప్రీ బుకింగ్స్ మాత్రం సంతోషాన్నిస్తున్నాయి. సినిమా నెగెటివ్ గా పబ్లిక్ లోకి వెళ్లడంతో సినిమాలో ఇంకెంత బూతు ఉందొ అని చూడడానికి ఇలా సినిమా టికెట్స్ ని బుకింగ్ మొదలవ్వగానే జనాలు విపరీతంగా బుక్ చేసేసుకుంటున్నారు. మరి మొదటి రెండు రోజులు అయితే ఈ బుకింగ్స్ జోరుగా ఉంటాయి గాని.... సినిమా టాక్ ఓకే అయితే పర్లేదు కానీ తేడా కొడితే మాత్రం..టీం.. పరిస్థితి ఎలా ఉంటుందో... చూద్దాం..?