నిన్న మంగళవారం చిరంజీవి పుట్టినరోజు కావడంతో మెగాస్టార్ కి ఇండస్ట్రీలోని చాలామంది నటీనటులు సోషల్ మీడియా ద్వారానో, లేకుంటే ఫోన్స్ ద్వారానో విషెస్ తెలియజేశారు. అయితే ఈ ఆగష్టు 22 న చిరు సినిమా లోగో లాంచ్, మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, చిరు చిన్నల్లుడు, అల్లు అరవింద్ మాత్రమే హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి మిగతా మెగా ఫ్యామిలీ మెంబెర్స్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, శిరీష్, నాగ బాబు లు హాజరు కాలేదు. అసలే ఈ కార్యక్రమానికి చిరు రాలేదని మెగా ఫాన్స్ డిజప్పాయింట్ అయితే వీళ్ళు కూడా రాకుండా హ్యాండ్ ఇచ్చేసరికి ఫాన్స్ మరింత నిరాశ పడ్డారనే టాక్ వినబడుతుంది.
ముఖ్యంగా మెగా ఫాన్స్ పాత రాగాన్నే అందుకున్నారు. ఎవ్వరొచ్చినా రాకపోయినా పవన్ వస్తే బావుండేదని అంటున్నారు. మరి ఫ్యాన్స్ పాత పాట పాడినా పవన్ నుండి ఇలాంటివి ఎక్సపెక్ట్ చెయ్యడం అనేది కష్టమైన పనే అని వారికి కూడా తెలుసు . అయితే ఈ మెగా ఈవెంట్ కి పవన్ రాకపోయినా కూడా తన అన్నగారు చిరు పుట్టినరోజు కావడంతో పవన్ స్వయంగా అన్న చిరు ఇంటికి వెళ్లి ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పివచ్చాడని అంటున్నారు. మరి అన్న, వదినలతో పవన్ కాసేపు ముచ్చటించినట్టు... అలాగే చిరు 151 వ సినిమా 'సై రా నరసింహారెడ్డి' గురించి అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం అందుతుంది.
అలాగే చిరంజీవి కూడా తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లబోతుందని.... అలాగే జనసేన కార్యాచరణ ఏమిటనేది అడిగి తెలుసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి అన్నదమ్ములు ఎప్పటికైనా ఒక్కటే. కానీ ఆ విషయం అన్నిసార్లు ప్రపంచానికి తెలియాలంటే కష్టమే. ఇక పవన్ రాక గురించి క్లారిటీ వచ్చేసింది. కానీ మిగతా వాళ్ళు ఈ ఈవెంట్ కి ఎందుకు గైర్హాజరయ్యారో తెలియాల్సి ఉంది.