Advertisementt

'సై రా' పై వారసులు సై..!!

Tue 22nd Aug 2017 07:37 PM
sye raa,uyyalawada narasimha reddy,controversy,chiranjeevi,uyyalawada narasimha reddy family,angry  'సై రా' పై వారసులు సై..!!
Uyyalawada Narasimha Reddy Family Angry on Sye Raa Title 'సై రా' పై వారసులు సై..!!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా పేరు అలా బయటికి వచ్చిందో లేదో ఇలా కాంట్రవర్సీ మొదలైంది. చిరు బర్త్ డే సందర్భంగా  చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. డైరెక్టర్ రాజమౌళి చేతులమీదుగా విడుదలైన ఈ చిత్ర టైటిల్ పై ఇప్పుడు వివాదం చెలరేగుతుంది.  'సై రా' టైటిల్ పై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెడ్డి  వారసులు సై అంటూ కాంట్రవర్సీ కి తెరలేపారు. 

ఈ చిత్రానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ కాకుండా సినిమా పేరు మార్చి.. 'సై రా' టైటిల్‌ను పెట్టడం పట్ల ఉయ్యాలవాడ వారుసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశభక్తుని జీవితగాథను ఆయన పేరుతోనే తెరకెక్కిస్తున్నామని మాకు చెప్పారు. కానీ ఇప్పుడు 'సైరా నరసింహారెడ్డి' ని సినిమాకు టైటిల్ గా ప్రకటించారు. ఈ టైటిల్ పట్ల మేము సంతృప్తి గా లేమని, పౌరుషానికి పెట్టిన గడ్డగా చెప్పుకునే ఉయ్యాలవాడ పేరు టైటిల్ లో లేకపోతే..ఒప్పుకునేది లేదని ఉయ్యాలవాడ వారుసులు హుకుం జారీ చేస్తున్నారు.  

మరి దీనిపట్ల నిర్మాతగా రాంచరణ్, దర్శకుడు సురేందర్‌రెడ్డి ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి వుంది. నయనతార కథానాయిక. ఏఆర్ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కథని అందిస్తుంది పరుచూరి సోదరులు.

Uyyalawada Narasimha Reddy Family Angry on Sye Raa Title:

Mega Star Chiranjeevi 151 film Title Sye Raa in Controversy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ