అటు హీరోలుగా నిలబడలేక, మరోవైపు మరలా కమెడియన్లుగా మారలేక సునీల్‌తో సహా గతంలో కూడా వేణుమాధవ్ వంటి వారు దెబ్బతిన్నారు. ఇక సునీల్ పరిస్థితి మరింత దారుణం. కామెడీ సినిమాలను ఎంచుకోకుండా ఏకంగా సిక్స్‌ప్యాక్ సాధించి ఎలాగైన మాస్ హీరోగా మారుదామని భావించాడు. 'తడాఖా' చిత్రం హిట్టయినా ఆ క్రెడిట్ నాగచైతన్యకి వెళ్లింది. ఇక ఆయన 'పూలరంగడు' తర్వాత చేసిన ఏ చిత్రం కూడా కనీసం యావరేజ్ టాక్‌ని కూడా తెచ్చుకోలేకపోయింది. ఆయన వల్ల ఫ్లాప్‌లను అందుకున్నవారిలో సురేష్‌బాబు, దిల్‌రాజులు కూడా ఉన్నారు. త్వరలో ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'ఉంగరాల రాంబాబు'గా వస్తున్నాడు.
కానీ ఓ నటుడు మాత్రం మంచి మంచి వేషాలు దక్కించుకుంటూ, సినిమాలో కీలకమైన రోల్స్ చేస్తూ ఎక్కడా ఓవర్ చేయకుండా, కథని నమ్ముకుని చిత్రాలు చేస్తున్నాడు. మరోవైపు కీలకమైన పాత్రలనే కాదు.. కమెడియన్ అవకాశాలను కూడా ఆయన వదులుకోవడం లేదు. అతనే శ్రీనివాసరెడ్డి. ఆయన చేసిన 'గీతాంజలి', 'జయ్యంబు నిశ్చయంబురా' చిత్రాలలో తన నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా 'ఆనందోబ్రహ్మ' చిత్రం కూడా బాగా చేశాడు. సినిమా పాయింట్ చుట్టూ నా చుట్టూనే తిరగాలి. నాకంటూ కొన్ని పాటలు కావాలి. కొన్ని ఫైట్స్ కావాలి? ఇంత సేపు నేను తెరపై కనిపించాలి అనే నియమాలు పెట్టుకోకుండా మంచి పాత్రలు వస్తే ఓకే అంటున్నాడు. ఇక ఈ చిత్రం తాజాగా విడుదలై మంచి పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. స్వయంగా దిల్‌రాజు వంటి నిర్మాత ఈ చిత్రం ప్రెస్‌మీట్‌కి వచ్చి.. ఈ చిత్రం చూసిన తర్వాత నాకు కూడా ఓ హర్రర్ కామెడీ చిత్రం చేయాలని ఉందని, అంతలా ఈచిత్రం తనను మెప్పించిందన్నాడు.
ఇక మనుషులుని చూసి దెయ్యాలు భయపడటం అనేది మంచి కొత్త పాయింట్ అని, ఈ చిత్రాన్ని హర్రర్ కామెడీ అనకుండా.. 'రివర్స్ హర్రర్ కామెడీ' అనాలని చెప్పారు. ఇక ఈ చిత్రంలో చివరి 40 నిమిషాలు వచ్చే సీన్స్‌ని.. వాటిలో నటించిన శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్‌ల మద్య వచ్చే సీన్స్‌ని తాను బాగా ఎంజాయ్ చేశానని ఓపెన్‌గా చెప్పేశాడు. తనకు ఈ చిత్రంతో ఎలాంటి సంబంధం లేకపోయినా దిల్‌రాజు చేస్తున్న ప్రమోషన్స్‌తో ఈ చిత్రం మరింత విజయం సాధించి, కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.