విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రం రాబోయే శుక్రవారమే విడుదల కాబోతుంది. A సర్టిఫికెట్ తో సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర పబ్లిసిటీ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఆ పబ్లిసిటీలో భాగంగా 'అర్జున్ రెడ్డి' పోస్టర్స్ ని పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసి సిటీలో అన్ని చోట్ల పెట్టడమే కాకుండా.... హైదరాబాద్ లోని సిటీ బస్సెస్ మీద కూడా పోస్టర్స్ ని అంటించి ప్రచారాన్ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్. అయితే బస్సు ల మీద అంటించిన 'అర్జున్ రెడ్డి' పోస్టర్స్ మీద హీరో హీరోయిన్ ల లిప్ లాక్ కిస్ పెట్టుకునే పోస్టర్స్ ఉండడంతో..... అవి చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు కి కోపం వచ్చి బస్సు మీదున్న ఆ పోస్టర్స్ ని చించిపడేసి తనకోపాన్ని తీర్చుకున్నారు.
అలాంటి సినిమా పోస్టర్స్ వల్లనే కుర్రకారు చెడిపోతున్నారని.... అలాంటి పోస్టర్స్ ని గవర్నమెంట్ బస్సు ల మీద ప్రచురించడానికి ఎంత ధైర్యం అంటూ విరుచుకుపడ్డారు. మరి బస్సు మీదున్న పోస్టర్ ని హనుమంతు రావు గారు చింపగానే అది కాస్తా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవడమే కాదు, ఈ విషయం ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ దగ్గరకి వెళ్లగా... ఆ విషయంపై కూల్ గా స్పందించిన విజయ్ దేవరకొండ హనుమంత రావు ని ఉద్దేశించి 'తాతయ్య కొంచెం చల్లబడు' అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.
మరి హనుమంతురావు గారు అలా సిటీ బస్సు మీద పోస్టర్ చించడం దానికి విజయ్ కౌంటర్ ఇవ్వడం చూస్తుంటే 'అర్జున్ రెడ్డి'కి ఫ్రీ గా పబ్లిసిటీ వచ్చేసినట్లు అనిపిస్తుంది కదా..!.