నారారోహిత్... కథల పరంగా ఇతను తన తొలి చిత్రం 'బాణం' నుండి అందరిలా కాకుండా డిఫరెంట్‌గా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. అన్ని చిత్రాలలో డిఫరెంట్ కథలను, డిఫరెంట్ క్యారెక్టర్లను చేస్తూ మెప్పిస్తున్నాడు. ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోయినా నటునిగా నారా రోహిత్‌కి మాత్రం ఎవ్వరూ వంకపెట్టలేరు. ఇక ఈయన లావుగా, బొద్దుగా ఉన్నాడనే విమర్శలు వచ్చాయి. వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఆయన నడుం బిగించి, జిమ్‌లు గట్రా చేసి సిక్స్‌ప్యాక్ కూడా సాధించాడు.
కానీ ఆయన ఒకే సమయంలో రెండుకు మించి చిత్రాలు చేస్తుండటం, అన్ని డిఫరెంట్ టైటిల్స్ నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్‌లు, డిఫరెంట్ జోనర్స్ అయినా సరే ఆయన నటించే చిత్రాలలో ఏ చిత్రాల టైటిల్స్ ఏంది? ఏ చిత్రానికి ఎవరు దర్శకుడు? వంటి విషయాలలో బోలెడు కన్‌ఫ్యూజన్ వచ్చేస్తోంది. ఇక అదే సమయంలో ఆయన తన చిత్రాల రిలీజ్ డేట్స్‌లో కూడా తప్పు చేస్తున్నాడు. లేదంటే ఖాళీగా ఉండటం, లేదంటే ఒకేసారి రెండు మూడు చిత్రాల డేట్స్‌ని అనౌన్స్ చేయడం చేస్తున్నాడు.
తాజాగా ఆయన నటించిన 'కథలో రాజకుమారి' చిత్రం ఎప్పుడో జూన్‌లోనే విడుదల కావాల్సిన చిత్రం. కానీ వాయిదాలు పడుతూ వస్తోంది. ఎట్టకేలకు 'అర్జున్‌రెడ్డి' చిత్రం రిలీజ్ డేట్‌నే అంటే ఈనెల 25న రిలీజ్‌కి ప్లాన్ చేశారు. కానీ ఈచిత్రం విడుదల వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి.
ఇక త్వరలోనే ఆయన నటించిన 'బాలకృష్ణుడు' చిత్రం కూడా రిలీజ్‌కి రెడీ అవుతోంది. మరి ఈ రెండు చిత్రాలు కూడా గతంలో లాగానే తన చిత్రాలతో తానే పోటీ పడుతున్నాడా? అనిపించక మానదు. ఇకనైనా చిత్రాల ఎంపిక, వాటి రిలీజ్ డేట్స్‌లో సరైన నిర్ణయం తీసుకోకపోతే నారా వారి హీరోకి ఇబ్బందులు తప్పవనే అనిపిస్తోంది....!