బాలీవుడ్ లో ఫ్యాషన్ షోలకు రారాజు లాక్మే ఫ్యాషన్ వీక్. ఈ లాక్మే ఫ్యాషన్ వీక్లో ప్రముఖ బాలీవుడ్ డిజైనర్స్ రూపొందించిన డిజైన్స్ తో బాలీవుడ్ భామలు లాక్మే ఫ్యాషన్ షోలో అలా అలా వయ్యారంగా నడిచొస్తుంటే ఉంటుంది చూడండి. ఎప్పుడు ఈ లాక్మే ఫ్యాషన్ షో అదిరిపోయే లేవల్లోనే జరుగుతుంది. ఈ షోలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అంతా రాంప్ వాక్ చేసినవారే. ఇప్పుడు ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ లో 2017 వింటర్ కు గాను లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్ ఫెస్టివ్ 2017 ఫ్యాషన్ షోని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ షోలో ప్రముఖ డిజైనర్స్ మనీష్ మల్హోత్రా, హార్దిక గులాటి, అర్పితా మెహతా వంటి వారు రూపొందించిన రకరకాల డిజైనర్ దుస్తులలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్, మోడల్స్ అందరూ ఈ రాంప్ వాక్ చేసి అందరి మతులు పోగొట్టారు.
అలాగే ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ కి బాలీవుడ్ తారలు కొంతమంది గెస్ట్ లుగా కూడా హాజరయ్యారు. ఇక వారు డిజైనర్ వెర్ దుస్తులతో కలర్ ఫుల్ గా ఆకట్టుకున్నారు. ఇక గెస్ట్ లుగా శ్రీదేవి కపూర్, ఆమె చిన్న కూతురు ఖుషి కపూర్, సోనాలి బింద్రే వంటివారు ఈ షోలో గెస్ట్ లుగా ఆకట్టుకున్నారు. ఇక సౌత్ భామలైన ఇలియానా, తాప్సి, శ్రియ వంటి వారు రాంప్ వాక్ చేస్తూ అదరహో అనిపించారు. అలాగే కృతి సనన్, కైరా అద్వానీ, జాక్వలిన్, ఈషా గుప్త, మలైకా అరోరా వంటివారు డిజైనర్ వెర్ దుస్తులలో ఈ షోలో కేకపెట్టించారు.
వారు వేసుకున్న ఆ దుస్తులు చూపరుల మతులు పోగొట్టేలా వున్నాయి. ఇక ఆ డిజైనర్ వెర్ దుస్తులలో బాలీవుడ్ అందాల భామలు చేసిన హాట్ షో నుండి చూపు మరల్చడం కూడా కాస్త కష్టమే. అంతలా భామలంతా లాక్మే ఫ్యాషన్ లో రెచ్చిపోయి అందాల ఆరబోతతో.... రాంప్ తో హొయలు పోయారు.