కొన్ని తరహా పాత్రలను రాసేటప్పుడే ఫలానా హీరో ఉండాలని కొందరు దర్శకులు ఫీలవుతారు. కానీ ఇది కొన్ని కథలకి మాత్రమే. కానీ చాలా మంది ఓ హీరోతో పనిచేస్తున్నప్పుడు ఇదే హీరోని దృష్టిలో పెట్టుకుని రాశానని, ఈ చిత్రం సబ్జెక్ట్‌కి ఆ హీరో మాత్రమే సూటబుల్ అని, అతను తప్ప ఇంకెవ్వరూ చేయలేరని చెబుతుంటారు. ఆ కథను అంతకు ముందే ఎంతమందినో అడిగినా కూడా వారు కాదన్నా కూడా తాము అనుకున్నది ఇదే హీరో అని భజన కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ఏ హీరో నటించినా అందులో ఏ మాత్రం మార్పులు అవసరంలేని సాదాసీదా కథకి కూడా ఇదే చెప్పి, చెప్పి ఆమాటకు ఉన్న పరువును తీస్తారు.
కానీ 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం మాత్రం చూస్తే రాధాజోగేంద్రగా రానా దగ్గుబాటి సెట్ అయినట్లుగా ఎవ్వరూ సెట్ కారని అనిపిస్తుంది. గతంలో అటు నెగటివ్, ఇటు పాజిటివ్ పాత్రలను చేసిన మోహన్‌బాబు తర్వాత అదే దిశగా పయనిస్తున్న రానాకి ఇది యాప్ట్ కథ అని చెప్పాలి. ఇక ఇంతకీ ఈచిత్రంలోని పాత్రకు నన్నే ఎందుకు పెట్టుకున్నారు? నాకే కథ ఎందుకు వినిపించారు అని రానా అడిగితే తేజ కూడా నిజాయితీగా సమాధానం చెప్పాడు.
మన హీరోలు ఒకే మూసలో ఆలోచిస్తారు. హీరో అంటే ధర్మం వైపే ఉండి, అందరినీ రక్షించే వారిగా చూపించాలని కోరుకుంటారు. కానీ ఈ చిత్రం కథలో పాజిటివ్ షేడ్స్‌తో పాటు నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. నేనుగతంలో పనిచేసిన హీరోలు కూడా మూస దోరణికి అలవాటుపడ్డారు. కానీ నీవు నెగటివ్, పాజిటివ్ రెండు రకాల పాత్రలు చేస్తు డిఫరెంట్‌గా సినిమాలు ఒప్పుకుంటున్నావు. అలాంటి హీరోనే నా పాత్రకి కావాలి. దీనికి తోడు నీకు ఈచిత్రం ముందు వచ్చిన విజయాలు, నువ్వు ఆల్‌రెడీ పూరీజగన్నాథ్-రాంగోపాల్‌వర్మ- రాజమౌళి- క్రిష్ వంటి మంచి దర్శకులతో పని చేయడం వల్ల నీ సత్తాపై నాకు నమ్మముందని చెప్పాడు. ఇది ఈ చిత్రం చూసిన అందరూ అనే మాట కావడం విశేషం.