టాలీవుడ్ లో కమెడియన్స్ కి ఒకప్పుడు కొదవే లేదు. అల్లు రామలింగయ్య తరంలో బోలెడుమంది కమెడియన్స్ వుండేవారు. ఆ తర్వాత బ్రహ్మానందం వచ్చాడు. ఆయన టైం లోనే ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీఎస్ వంటి కమెడియన్స్ టాలీవుడ్ ని ఏలేశారు. ఆ తర్వాత సునీల్, ఆలీ వంటి వారు కూడా కమెడియన్స్ గా కొన్నాళ్ళు తమ హవా టాలీవుడ్ లో కొనసాగించినప్పటికీ.... ఆ తర్వాత సునీల్ హీరోగా మారడం, ఆ తర్వాత సప్తగిరి వంటివారు కొన్నాళ్ళు హాస్యంతో సందడి చేసినా ఎక్కువకాలం కమెడియన్స్ గా మనలేకపోయారు. ఇక బ్రహ్మనందం చాలా కాలమే టాలీవుడ్ లో కమెడియన్ గా ఉన్నప్పటికీ ఆయన హవా ఇప్పుడు ప్రెజెంట్ సినిమాల్లో కనబడడంలేదు. అయితే ఒక్కసారిగా బ్రహ్మీ ని టాలీవుడ్ డైరెక్టర్స్ పక్కన పెట్టేశారు.
ఇక ఇప్పుడు ప్రస్తుతం పృద్వి, వెన్నెల కిషోర్ వంటివారు కమెడియన్స్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. కానీ పృద్వి కామెడీ కూడా రొటీన్ గా అయిపోవడంతో ఆయన కూడా సినిమాల్లో ఎన్నాళ్ళో నిలబడే పరిస్థితి లేదు. ఇక ప్రస్తుతం వెన్నెల కిషోర్ మాత్రం సినిమాల్లో మంచి జోరు చూపిస్తున్నాడు. అలాగే వెన్నెల కిషోర్ కి తోడు జబర్దస్త్ కమెడియన్స్ కాస్త చెయ్యందిస్తున్నా... వెన్నెల కిషోర్ మాత్రం తనదైన శైలిలో కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. మంచి మంచి అవకాశాలతో సినిమాల్లో తనకిచ్చిన పాత్రకి 100 పెర్సెంట్ న్యాయం చేసే దిశగా పయనిస్తున్నాడు.
మొన్నటికి మొన్న 'అమితుమీ' చిన్న చిత్రంగా విడుదలై వెన్నెల కిషోర్ కామెడీతోనే ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమాలో నటించిన నటీనటులు అవసరాల శ్రీనివాస్ మిగిలిన వారికంటే వెన్నెల కిషోర్ కామెడికే పెద్ద పీట వేశారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు తాజాగా వెన్నెల కామెడీ 'ఆనందో బ్రహ్మ' తో మరోసారి హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో చెవుడు, రేచీకటి ఉన్న వ్యక్తిగా కిషోర్ చేసిన హార్రర్ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 'ఆనందో బ్రహ్మ' ఫస్ట్ హాఫ్ చాలా చప్పగా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం వెన్నెల కిషోర్ రాకతోనే కొంచెం పైకి లేస్తుంది. ఆ తర్వాత షకలక శంకర్ కి వెన్నెల కిషోర్ కి తోడవడంతో ఓ ఇరవై నిమిషాల పాటు నవ్వులే నవ్వులు. ఆ ఇరవై నిమిషాల ఎపిసోడే సినిమాకు హైలెట్. ఈ సినిమా హిట్ తో వెన్నెల ఇక కమెడియన్ గా టాప్ ప్లేస్ లో వున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.