Advertisementt

నాగ్ 'నిర్ణయం'..అఖిల్ ప్రేమకోసమేరోయ్..!

Sun 20th Aug 2017 09:13 PM
nagarjuna,akhil,nirnayam,hello guru premakosameroi,akhil second movie  నాగ్ 'నిర్ణయం'..అఖిల్ ప్రేమకోసమేరోయ్..!
Nagarjuna Starts Puzzle Game on Akhil 2nd Movie నాగ్ 'నిర్ణయం'..అఖిల్ ప్రేమకోసమేరోయ్..!
Advertisement
Ads by CJ

అఖిల్ రెండో సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ నెల 21 న అఖిల్ సెకండ్ ఫిలిం కి సంబందించిన ఒక విశేషం ఉంటుందంటూ అక్కినేని కాంపౌండ్ వార్తలు వదులుతుంది. కానీ అనుకోకుండా అఖిల్ సెకండ్ ఫిలిం పిక్ సోషల్ మీడియాలో లీకైంది. అయ్యో అనుకునే లోపే ఆ సినిమా నిర్మాత నాగార్జున లైన్ లో కొచ్చి లీక్ గురించి పట్టించుకోకండి... ఇదిగో ఒరిజినల్ అంటూ డైరెక్ట్ గా ఒక ఒరిజినల్ పిక్ ని సోషల్ మీడియాలో వదిలాడు. మరి ఫస్ట్ లుక్ వచ్చేసింది.... ఆగష్టు 21 న మరేం విశేషం ఉంటుందో అనుకునే లోపు మళ్ళీ నాగ్ లైన్ లో కొచ్చి అఖిల్ మూవీ టైటిల్ కి చిన్న క్లూ అంటూ పెద్ద వీడియో వదిలాడు.

అఖిల్ సెకండ్ ఫిలిం టైటిల్ కి క్లూ అంటూ తనకి ఎంతో ఇష్టమైన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ 'హలో గురూ ప్రేమ కోసమే రా ఈ జీవితం' అనే పాట బిట్ వీడియోను పోస్ట్ చేశాడు. అంతే కాదు....  మళ్లీ మరో క్లూ కూడా ఇస్తామంటూ మరో హింట్ కూడా ఇచ్చారు. అంటే నాగ్ అలా అనౌన్స్ చేసాడో లేదో.... అఖిల్ రెండో సినిమాకి  టైటిల్ కొంచెం పెద్దగా ఉంటుందా? లేకపోతె ఆ సాంగ్ లోని 'హలొ గురూ' అంటూ షార్ట్ కట్ లో పెడతారా ? అంటూ చర్చ మొదలైపోయింది. మరి నాగార్జునకు ఈ మధ్యన పొడవాటి టైటిల్స్... కొత్త కొత్త టైటిల్స్ 'సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం' వంటివి నచ్చినట్టు ఇప్పుడు కూడా 'హలో గురూ ప్రేమ కోసమే రా'....  అనేది నచ్చుతుందా అనే ఎడతెగని చర్చలు ఫిలింనగర్ లో షురూ అయ్యాయి.

ఇక్కడే నాగార్జున తెలివిని అప్రిషెట్ చెయ్యకుండా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే అఖిల్ రెండో ఫిలిం పిక్ లీక్ చెయ్యడం దగ్గర నుండి ఇప్పుడు ఈ టైటిల్ పజిల్ పెట్టిన వరకు అందరి అటెన్షన్ అఖిల్ సినిమా మీద ఉండేలా ప్లే చేశాడు. మరి నాగ్ ప్లాన్ వర్కౌట్  అయ్యేలాగే కనబడుతుంది. ఈ ఆగష్టు 21 అంటే రేపు సోమవారం వరకు అందరూ అఖిల్ రెండో సినిమా టైటిల్ కి ఆ పేరు పెడతారు... ఈ పేరు పెడతారు అంటూ డిస్కర్స్ చేస్తూనే ఉంటారు గనక నాగ్ ఈ ప్లాన్ లో సక్సెస్ అయ్యాడనే అనిపిస్తుంది.

Nagarjuna Starts Puzzle Game on Akhil 2nd Movie:

Nagarjuna Hit for Akhil Akkineni Second Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ