Advertisementt

'అర్జున్‌రెడ్డి' చాలా చాలా హాట్ గురూ..!

Sat 19th Aug 2017 11:24 PM
arjun reddy,censor problems,vijay devarakonda,arjun reddy movie  'అర్జున్‌రెడ్డి' చాలా చాలా హాట్ గురూ..!
Censor Gives A Certificate to Arjun Reddy 'అర్జున్‌రెడ్డి' చాలా చాలా హాట్ గురూ..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం 'పెళ్లి చూపులు' తర్వాత యువ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'అర్జున్‌రెడ్డి' పై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో పాజిటివ్‌ బజ్‌ ఉంది. ఈ చిత్రంకి సంబంధించి విడుదల చేసిన హాట్‌ లిప్‌ కిస్‌తో పాటు శృంగార సన్నివేశాలు, పడకగది సీన్స్‌, ఇంకా పలురకాలైన డబుల్‌ మీనింగ్‌లు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్స్‌లో కూడా ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. సినిమాలోని కిస్సింగ్‌ సీన్లు, ఇతర బూత్‌ కంటెంట్‌ కూడా చిత్రంలోని ప్రధాన పాయింట్‌కి తగ్గట్లుగానే ఉందని, ఆయా సన్నివేశాలు, సీన్స్‌ సినిమా కథ డిమాండ్‌ చేయడంతోనే వాటిని పెట్టామని, కాబట్టి వాటిని తొలగించకూడదని దర్శకుడు సందీప్‌ రెడ్డి చేసిన వాదనలతో ఎట్టకేలకు సెన్సార్‌ బోర్డ్‌ కూడా ఏకీభవించింది. 

దీంతో కొన్ని సీన్స్‌లోని డబుల్‌ మీనింగ్‌లను మ్యూట్‌ మాత్రమే చేసి ఈ చిత్రానికి పెద్దలకు మాత్రమే అన్నట్లుగా 'ఎ' సర్టిఫికేట్‌ ఇచ్చేసింది. ఈచిత్రాన్ని, అందులోని కంటెంట్‌ను మొదటి నుంచి చూస్తూ వస్తున్నవారు మాత్రం ఈ చిత్రం సెన్సార్‌ ఇబ్బందుల్లో పడటం ఖాయమనే భావించారు. అయినా ఈ చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికేట్‌ 'ఎ' సర్టిఫికేట్‌తో సరిపుచ్చుకోవడం ఈ చిత్రం యూనిట్‌కి ఎంతో ఆనందాన్నిన్నిస్తోంది. 

ఇక ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ ఖాయమంటూ విజయ్‌ దేవరకొండ కొంతకాలంగా 'దీనమ్మ.. బ్లాక్‌బస్టర్‌' కొట్టడం ఖాయమని తన నమ్మకాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఇక వచ్చే శుక్రవారం నాడు అంటే ఆగష్టు25న రిలీజ్‌ కానున్న ఈ చిత్రంలో అలనాటి మహానటి కాంచన బామ్మగా నటిస్తుండగా, షాలిని హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈచిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది....! 

Censor Gives A Certificate to Arjun Reddy :

Arjun Reddy Movie Censor Completed and Get A Certificate

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ