ఓ స్టార్‌కి తమ తోటి హీరోలతో పాటు డైరెక్టర్లు, నిర్మాతలతో కూడా అనుబంధం ముఖ్యం. ఓ సినిమాని జడ్జి చేయబోయే ముందు ఆయా దర్శకులు, నిర్మాతల ఓపెనియన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక స్టార్ రామ్‌చరణ్‌కి తన ఫ్యామిలీలోనే చిరంజీవి, అల్లుఅరవింద్ వంటి వారు ఉన్నారు. ఇక హీరోలలో కూడా శర్వానంద్, రానా, నవదీప్‌లతో మంచి పరిచయం ఉంది.
ఇప్పుడు రామ్‌చరణ్ స్నేహితుల లిస్ట్‌లో తనతో 'ధృవ' చిత్రం రీమేక్ చేసి హిట్ కొట్టిన సురేందర్‌రెడ్డి కూడా చేరాడు. 'ధృవ' తర్వాత చరణ్ తన బేనర్‌లోనే తన తండ్రితో నిర్మించే 'ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి' వంటి ప్రెస్జీజియస్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందే చిత్రం సైతం ఆయన చేతుల్లోనే పెట్టాడు.
ఇక ఇటీవల జరిగిన సురేందర్‌రెడ్డి కుమారుడి బర్త్‌డే వేడుకలకి హాజరైన చరణ్, ఇక తాజాగా సురేందర్‌రెడ్డికి సంబంధించిన ఓ రెస్టారెంట్ ఓపెనింగ్‌కి కూడా ముఖ్యఅతిధిగా హాజరయ్యాడు. ఇక తన తండ్రితో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చేయబోయే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కి సంబంధించిన నిరాడంబరంగా ఆగష్టు15న స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా జరిగిన వేడుకలో కూడా చరణ్ తన స్నేహితుడైన సురేందర్‌రెడ్డి కుమారుడుని ఎత్తుకుని గ్రూప్ ఫోటోలకు ఫోజులిచ్చాడు.
సో.. ఈ దర్శకుడు ఇప్పటికే తనకు, తమ అల్లుఅర్జున్‌కి పెద్ద పెద్ద హిట్లను ఇచ్చినట్లుగానే తన తండ్రికి కూడా మెమరబుల్ హిట్‌ని అందిస్తాడని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఇలా మెగా ఫ్యామిలీ కాంపౌండ్‌లోకి నిన్నటితరం రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డిల తర్వాత చోటుచేసుకున్న వినాయక్‌తో పాటు సురేందర్‌రెడ్డి కూడా చోటు దక్కించుకున్నాడని ఫిక్సవ్వవచ్చు.