Advertisementt

అఖిల్ పిక్ లీకైందా లేక కావాలనే చేశారా..?

Sat 19th Aug 2017 07:41 PM
akhil akkineni,nagarjuna,vikram k kumar,akhil second pic leak  అఖిల్ పిక్ లీకైందా లేక కావాలనే చేశారా..?
Akhil's Second Venture First Look Leaked అఖిల్ పిక్ లీకైందా లేక కావాలనే చేశారా..?
Advertisement
Ads by CJ

అఖిల్ - విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో అఖిల్ రెండో సినిమా మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు శరవేగంగానే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబందించిన అప్ డేట్ ఇంతవరకు లేదు. ఈ సినిమాని నిర్మిస్తున్న నాగార్జున కూడా ఈ సినిమాకి సంబందించిన న్యూస్ ఎక్కడ బయటకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొదటి సినిమా 'అఖిల్' తో బాగా దెబ్బతిన్న నాగార్జున అండ్ అఖిల్ లు మాత్రం ఈ రెండో సినిమా విషయంలో కాస్త ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారనే టాక్ మొదటి నుండి ఉంది.

అయితే అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ ని ఆగష్టు 21 న విడుదల చేస్తామని చెప్పిన చిత్ర యూనిట్ కి ఇప్పుడొక షాక్ తగిలింది. ఇంకా టైటిల్ అంటూ ఫిక్స్ చెయ్యని అఖిల్ రెండో సినిమా పిక్ ఒకటి సోషల్ మీడియాలో లీకయ్యింది. ఈ పిక్ లో అఖిల్ ఒకవైపు తన లవర్ తో కిస్ చేయించుకుంటూ.. మరోవైపు విలన్స్ ని ఇరగదీస్తున్నాడు. మరి ఇప్పటివరకు ఈ చిత్రం షూటింగ్ ఎక్కడ జరుగుతుందో ఎవరికీ తెలియని కూడా తెలియదు.... అలాంటిది ఇప్పుడు ఈ పిక్ అనుకోకుండా లీక్ కావడమేమిటి అనే ప్రశ్నలు తలెత్తే లోపలే.... నాగార్జున.. అఖిల్ సెకండ్ ఫిలిం పిక్ లీకైతే లీకైంది... దాని ఒరిజినల్ పిక్ చూడండి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

మరి ఆ పిక్ అందరిని బాగానే ఆకట్టుకుంటుంది గాని... ఇప్పుడు అఖిల్ ఫస్ట్ లుక్ ఆఫీషియల్ గానే బయటికి వచ్చేసింది. మరి ఆగష్టు 21 న ఫస్ట్ లుక్ అన్నారు ఇప్పుడెలాగూ అది బయటికి వచ్చింది. మరి ఆ డేట్ లో అఖిల్ రెండో సినిమా టైటిల్ ని ఎమన్నా వదులుతారేమో అంటూ అక్కినేని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ రెండో సినిమా టైటిల్స్ గా 'జున్ను, ఎక్కడ ఎక్కడ వుందో తారక, రంగుల రాట్నం' అంటూ కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఇకపోతే అఖిల్ రెండో మూవీ పిక్ లీక్ పై కూడా భిన్న వాదనలు వినబడుతున్నాయి. ఫస్ట్ లుక్ విడుదలకు ముందే హైప్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే చిత్ర టీమ్ ఈ పిక్ ని ఇలా సోషల్ మీడియాలో లీక్ చేసిందంటున్నారు. ఏమైనా అఖిల్ రెండో సినిమా పిక్ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది.

Akhil's Second Venture First Look Leaked:

Unexpectedly, Akhil's second venture's first look has been leaked. It is still uncertain whether the makers or any insiders have leaked the pic.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ