Advertisementt

ఈ యాంకర్.. ఐటెంగా మారబోతుందా?

Sat 19th Aug 2017 06:41 PM
anasuya,item songs,anchor anasuya,rangasthalam movie  ఈ యాంకర్.. ఐటెంగా మారబోతుందా?
Anasuya Green Signal to Item Numbers ఈ యాంకర్.. ఐటెంగా మారబోతుందా?
Advertisement
Ads by CJ

బుల్లితెర మీద యాంకర్ గా అడుగుపెట్టి జబర్దస్త్ షోతో పాపులర్ అయిన హాట్ యాంకర్ అనసూయ వెండితెర మీద అవకాశాల కోసం ఎదురు చూసి చూసి ఇప్పుడొక డెసిషన్ కి వచ్చిందట. అదేమిటంటే వెండితెర మీద ఐటెం కి ఒకే చెప్పాలనే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదేమిటి ఐటమ్స్ కి నేను దూరం అంటున్న ఈ హాట్ భామ ఇప్పుడు ఐటెం సాంగ్స్ కి ఓకె చెప్పడమేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అదేనండి బుల్లితెర మీద నుండి వెండితెర మీదకి వచ్చేసి హీరోయిన్ పాత్రల్లో మెరిసి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగాలి అని కలలు కన్న ఈ ఇద్దరు పిల్లల తల్లికి అక్కడ తనకు కావాల్సిన ఆఫర్స్ లేక.. వాటికోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించుకుని దర్శక నిర్మాతల మీదకి వదిలినా ఉపయోగం లేక ఈ డెసిషన్ తీసుకుందని అంటున్నారు.

ఇంతకూ ముందు కూడా ఐటమ్స్ కి నేను చాలా దూరం అంటూనే సాయి ధరమ్ తేజ హీరోగా వచ్చిన 'విన్నర్' లో 'సుయ సుయ అనసూయ' అంటూ అదరగొట్టిన అనసూయ ఆ సాంగ్ ని ఐటెం అంటే ఒప్పుకోనని అది కేవలం స్పెషల్ సాంగ్ అంటూ లెక్చర్లు దంచిన ఈ హాట్ భామ ఇప్పుడు రామ్ చరణ్ 'రంగస్థలం' లో కూడా ఇలాంటి ఒక ఐటెం పాటకే చిందులు వేయబోతుందనేది లేటెస్ట్ న్యూస్. సుకుమార్ 'రంగస్థలం' కోసం అనసూయని ఒక కీలక పాత్రకి సెలెక్ట్ చేశారని చెబుతున్నప్పటికీ అందులో అనసూయ చిన్న కేరెక్టర్ చేసినప్పటికీ..... అందులో ఒక సాంగ్ కోసం చిందులు వేసిందంటూ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.

అయితే ఇలా వరుసగా ఐటమ్స్ లోనే ఆఫర్స్ రావడం... హీరోయిన్ గా ఛాన్స్ లు లేకపోవడంతో అనసూయ ఇక ఐటెం సాంగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా వచ్చిన ప్రతి ఆఫర్ ని వినియోగించుకుని ఇలా సొమ్ము చేసుకోవాలనే నిర్ణయానికి అనసూయ వచ్చినట్లుగా చెబుతున్నారు. సో..మొదటినుండి ఐటమ్స్ కి దూరమంటూనే ఇప్పుడు మాత్రం సై అనేస్తు ఆఫర్స్ దండుకోవాలని అనసూయ చూస్తుందనేది మాత్రం లేటెస్ట్ న్యూస్.

Anasuya Green Signal to Item Numbers:

Hot anchor Anasuya Ready to Perform in Item Songs

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ