నేడున్న దర్శకుల్లో సినిమా కథ వింటేనే ఫలితం చెప్పేయగలిగిన నిర్మాతలు ఇద్దరు. వారే దిల్‌రాజు, అల్లుఅరవింద్. ఇక దిల్‌రాజు గురించి చెప్పాల్సి వస్తే ఒకటి అరా డబ్బింగ్ చిత్రాలు, ఇతర సినిమాలలో తప్ప ఆయన జోస్యం ఎప్పుడు తప్పలేదు. దాదాపు 90శాతం సక్సెస్ రేటును ఎంజాయ్ చేస్తున్న నిర్మాత ఈయన. ఇక ఈయన సినిమా చూసి చెప్పాడంటే మాత్రం ఇక తిరుగే ఉండదంటారు. అలాంటి దిల్ రాజు మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌కి మొదటి నుంచి పెద్ద దిక్కుగా ఉంటూ ఉన్నాడు. తన మొదటి రెండు చిత్రాలతో 25కోట్ల దాకా మార్కెట్ పెంచుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత 'తిక్క, విన్నర్'వంటి చిత్రాలతో తన క్రెడిబులిటీని తనే పోగొట్టుకుని స్వయంకృతాపరాధం చేశాడు.
ఇక దర్శకునిగా 'వాంటెడ్'తో మెప్పించలేకపోయిన రచయిత బి.వి.ఎస్. రవితో ప్రస్తుతం 'జవాన్' చిత్రం చేస్తున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్1న ఈ చిత్రం రేసులో ఉండాల్సింది. కానీ అన్ని మన మంచికే అన్నట్లుగా తాజాగా ఈ చిత్రానికి దిల్‌రాజుని సమర్పకునిగా మార్చేసి ఆయనకు మార్కెటింగ్ శాఖను వదిలిపెట్టారు. ఇక 'జవాన్' లో దిల్‌రాజుకి భాగస్వామ్యం కలిపిన తర్వాత దిల్‌రాజు ప్రత్యేకంగా ఈ చిత్రం వేయించుకుని చూశాడట. కానీ కొన్ని సీన్స్ సాగతీతగా, మరికొన్ని అనవసరంగా, మరికొన్ని సరిగ్గా తీయలేని సన్నివేశాలను చూసి సినిమాకి రీషూట్స్ ఖచ్చితంగా అవసరమని తేల్చేశాడని తెలుస్తోంంది.
సో.. ఇటు దిల్‌రాజు మాట వినకుండా రిలీజ్ చేయాలంటే తెలిసితెలిసి ఎవరూ ఆ సాహసం చేయలేరు. దాంతో ఈ చిత్రానికి మరలా మరమ్మత్తులు అవసరం కావడంతో ఈ చిత్రం విడుదల 'పైసా వసూల్' వల్ల వాయిదా పడటం మంచిదే అయిందని, మరో డేట్‌ని నవంబర్‌లో చూసుకునే లోపు ఈ పనులను కూడా పూర్తి చేసి సాయికి హిట్ ఇవ్వడమే కాదు.. తన భవిష్యత్తును కూడా మార్చుకోవాలనే నిర్ణయానికి మన రచయిత బి.వి.ఎస్. రవి వచ్చాడని అంటున్నారు. మొత్తానికి ఏ విధంగా చూసుకున్నా మోత మాత్రం నిర్మాతకే కదా..! పడేది.!