ఏడాదికి పైగా షూటింగ్ జరుపుతున్నా కూడా 'స్పైడర్' షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయినా కూడా కొన్ని ప్యాచ్‌వర్క్‌లతో పాటు కొత్తగా మరో పాటను రాయించి షూట్ చేయాలని భావిస్తున్నారట. దీని కోసం సంగీత దర్శకుడు హారీస్ జైరాజ్ ఓ ట్యూన్‌ని సైతం రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 'బాహుబలి' చిత్రంలోని మొదటి పార్ట్‌లో చూపించి వినిపించే లిపి లేని ఓ కొండ జాతి భాషగా కాలకేయ ప్రభాకర్ పైన కిలికి భాష ప్రయోగం చేసిన రచయితగా మదన్‌కి మంచి పేరుంది. ఈ కిలికి భాషకు తెరరూపం ఇచ్చి ఆ భాషలో ప్రయోగం చేసినది మన తెలుగు రైటర్ కాదు. అతను తమిళ గేయ-సంబాషణల రచయిత మదన్ కర్కీ.
ఈయనకు తాజాగా తెలుగులో తన మొట్ట మొదటి పాటను అందునా మహేష్‌బాబు వంటి సూపర్‌స్టార్‌కి రాసే సువర్ణావకాశం దక్కించుకుని అదృష్ట వంతుల్లో నెంబర్‌వన్ స్ధానం పొందాడనే చెప్పవచ్చు. ఈ చిత్రం దర్శకుడు మురుగదాస్, సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్‌లు ఈ అవకాశం ఇవ్వడంతో ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇక ఈ చిత్రం కోసం ఆ పాట రాసే అవకాశం తనకు రావడాన్ని ఈ యువ రచయిత ఓపెన్‌గా ఎంతో ఆనందంగా చెబుతున్నాడు.
మురుగదాస్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మహేష్‌బాబు అభిమానులు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ, అందరూ మెచ్చే విధంగా ఈ పాటను రాస్తానని ఆయన అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ పాటను యాడ్ చేయనుండటం మహేష్‌బాబు అభిమానులను ఎంతో ఆనందంలో ముంచేత్తే విషయంగా చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళభాషల్లో సెప్టెంబర్ 27న దసరా కానుకగా రిలీజ్ చేయాలని ఆల్‌రెడీ డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్9న మహేష్‌ని కోలీవుడ్‌కి పరిచయం చేసే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి, ఆపై రెండు భాషల్లోనూ విడివిడిగా పాటల విడుదల వేడుకలను నిర్వహించనున్నారు.