Advertisementt

చైతూ, అల్లరి నరేష్ కి అస్సలు పడటం లేదు!

Fri 18th Aug 2017 08:12 PM
allari naresh,meda meeda abbayi,naga chaitanya,yuddham sharanm,september 8  చైతూ, అల్లరి నరేష్ కి అస్సలు పడటం లేదు!
Chaitu and Allari Naresh Movies Release on Same Day చైతూ, అల్లరి నరేష్ కి అస్సలు పడటం లేదు!
Advertisement
Ads by CJ

నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'యుద్దం శరణం'. కాగా ఈ చిత్రాన్ని మొదట ఈనెల 25న అనుకుని, ఏవో కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్‌ 8కి పోస్ట్‌పోన్‌ చేశారు. కృష్ణ మరిముత్తు అనే తమిళ దర్శకుడు పరిచయం అవుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతోంది. అభిరుచి కలిగిన నిర్మాత సాయికొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ట్రైలర్స్‌ తో బాగా ఆకట్టుకున్న ఈ చిత్రంలో డిఫరెంట్‌ నాగచైతన్య కనిపిస్తాడని అంటున్నారు. మరి పెళ్లికి ముందు నాగచైతన్యకి ఈ చిత్రం ఎలాంటి హిట్‌ని అందిస్తుందో వేచి చూడాల్సివుంది. 

ఇక 'సుడిగాడు' తర్వాత సరైన హిట్‌ లేని అల్లరోడు పెళ్లైన తర్వాత అయినా తన కెరీర్ ఇకపై సాఫీగా సాగిపోతుందని ఆశగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న 'మేడ మీద అబ్బాయి' చిత్రం కూడా సెప్టెంబర్‌ 8నే విడుదల కానుండటం చిత్రం. ఒకటి యాక్షన్‌థ్రిల్లర్‌కి ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలగలిపిన చిత్రం కాగా, 'మేడమీద అబ్బాయి' ఫ్యామిలీ సెంటిమెంట్‌ ని, కామెడీని కలబోసిన చిత్రం. ఇక 'యుద్దం శరణం' చిత్రం ద్వారా కృష్ణమరిముత్తు అనే తమిళ వ్యక్తి దర్శకునిగా పరిచయం అవుతుంటే, 'మేడమీద అబ్బాయి' చిత్రం ద్వారా మలయాళ దర్శకుడు ప్రజిత్‌ తెలుగుకు పరిచయం అవుతున్నాడు. 

ఈ చిత్రం ఓ మలయాళ రీమేక్‌ ద్వారా రూపొందుతోంది. గతంలో తనకు 'సుడిగాడు' వంటి సూపర్‌హిట్‌ కూడా రీమేక్‌ ద్వారానే రావడంతో ప్రస్తుతం ఈ మరో రీమేక్‌ ద్వారా మరలా తన కెరీర్‌ గాడిన పడుతుందని అల్లరోడు ఎంతో ఆశతో ఉన్నాడు. మొదట 'మేడ మీద అబ్బాయి' చిత్రాన్ని కూడా మొదట ఈనెల  25న విడుదల చేయాలని భావించిన సంగతి తెలిసిందే.  25న విడుదల కావాల్సిన ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్‌ 8న విడుదల కానుండటం విశేషంగా చెప్పాలి! 

Chaitu and Allari Naresh Movies Release on Same Day:

Allari Naresh Meda Meeda Abbayi, Naga Chaitanya Yuddham Sharanm Movies Release On September 8 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ