ఎన్టీఆర్ 'జై లవ కుశ'గా రానున్న వారంలోపలే మహేష్‌బాబు 'స్పైడర్' సినిమా విడుదల కానుంది. అంటే ఎన్టీఆర్ సినిమా ఎంత బాగున్నా కలెక్షన్ల కుమ్ముడు మాత్రం ఓ వారం పాటే ఉండనుందని కొందరు అంటుంటే, 'స్పైడర్' రిజల్ట్ తెలిసిన ఓ వారం తర్వాత రెండింటిలో బాగున్న చిత్రం మిగతా దసరా సెలవులను ఏలబోతోందని కొందరు లెక్కలు కడుతున్నారు. 'స్పైడర్' టాక్‌ని బట్టి మిగిలిన రోజుల్లో ఏ చిత్రం హవా కొనసాగించనుందో అర్ధమవుతుందనేది కూడా సాలిడ్ పాయింటే.
ఇక 'జై లవ కుశ' పై ఇంతగా నమ్మకం ఏర్పడడానికి కేవలం ఒకే ఒక్క 'జై' క్యారెక్టర్‌కి శాంపిల్‌గా విడుదలైన ఒకే ఒక్క టీజర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓ సినిమాపై ఎంతగా అంచనాలు పెంచుకోవచ్చు? ఎలా అంచనాలను పెంచుకోవాలి? అనే విషయాలను 'జై' టీజర్ ద్వారా ఈ యూనిట్ చూపి నిరూపించింది. ఇక త్వరలో విడుదలకానున్న 'లవ, కుశ'ల టీజర్లు కూడా విడుదలైతే ఇక అంచనాలు ఆకాశాన్నంటుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రం ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమా కెరీర్‌లో ఏ చిత్రం పలకనంత భారీ రేట్లకు అమ్ముడవుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి.
ఇక 'నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్'లని మించి ఓవర్‌సీస్ రైట్స్ కూడా చెబుతున్నారు. నిర్మాతలు భారీ రేట్లు చెబుతున్నాకూడా 'జై లవ కుశ' ఓవర్‌సీస్ రైట్స్ ఏకంగా 8.5 కోట్లు పలుకుతున్నాయని తెలుస్తోంది. ఈ రేటు కేవలం దర్శకుడు బాబి వల్లనో లేక నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్ బేనరనో చూసి రావడం లేదు. కేవలం ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం వల్లే ఈ చిత్రం సమ్‌థింగ్ స్పెషల్ అనే అంచనాలతోనే వస్తున్నాయి.
సో.. ఈ చిత్రం ఓవర్‌సీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఖచ్చితంగా 2.5 మిలియన్లు దాటి వసూలు చేయాలి. సినిమా వైవిధ్యంగా ఉండి, ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపితే ఇదేం పెద్ద పని కాదనే చెప్పుకోవాలి. కానీ మధ్యలో 'స్పైడర్' ఉండటం, ఇది కూడా వైవిధ్యభరితమైన చిత్రం కావడం, మురుగదాస్ దర్శకుడు కావడంతో ఈచిత్రాన్ని కూడా తక్కువ అంచనా వేయలేం.