దర్శకుడిగా హిట్ లేకపోయినా హీరోలకు మాటలు చెప్పడంలో, ముగ్గులోకి దింపడంలో మెహర్‌రమేష్ తర్వాతే ఎవరైనా. ఆయన తీసిన 'కంత్రి, బిల్లా, శక్తి, షోడో'ఇలా ఎన్ని భారీ ఫ్లాప్‌లొచ్చినా ఆయన వచ్చి కథ చెబితే నేడైనా మన హీరోలు వారి ప్రమేయం లేకుండానే తలూపాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతలా తన మాటలతో ఆయన మంత్రముగ్దులని చేస్తాడు. నిర్మాతలు, హీరోలు సినిమాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నా ఈయన దర్శకత్వం తట్టుకునే ఓపిక మాత్రం మన ప్రేక్షకులకు లేదనే చెప్పాలి. దాంతోనే మన నిర్మాతలు, హీరోలు కాస్త ఆలోచిస్తున్నారు.
కాగా గత కొంతకాలంగా ఈయన మహేష్‌బాబుకి చెందిన సినిమా ఈవెంట్లలో, షూటింగ్‌లలో, ఆయన ఫ్యామిలీకి చెందిన వేడుకల్లో తరచుగా కనిపిస్తున్నాడు. ఇక మెహర్ రమేష్ ఓ మంచి టెక్నీషియనే కానీ డైరెక్టర్ మాత్రం కాదు. ఇక ఆయనంటే మహేష్‌బాబుకి, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్‌కి ఎంతో నమ్మకమని అంటున్నారు. మహేష్ నటించిన రెండు మూడు యాడ్స్‌కి కూడా ఆయన డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇక నమ్రతాతో పాటు మహేష్‌కి సంబంధించిన బిజినెస్‌లు, బ్రాండ్ అంబాసిడింగ్‌లు వంటి అన్ని వాటిల్లో ఆయన మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌కి ఎంతో హెల్ప్‌గా ఉంటున్నాడట.
అలాగే ఏపీకి సంబంధించిన మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరులకు సంబంధించిన పలు విషయాలలో మెహర్ రమేష్‌కి ఎంతో అనుభవం ఉందని అందుకే ఏపీలో మహేష్ తాను పెట్టే పలు బిజినెస్‌లకు గల్లా జయదేవ్‌తో పాటు మెహర్‌రమేష్ సలహాలను కూడా ఎక్కువగా తీసుకుంటున్నాడట. మొత్తానికి మహేష్‌బాబుతో మెహర్‌కి బిజినెస్‌పరమైన సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఇక తాజాగా దిల్‌రాజు- అశ్వనీదత్- వంశీ పైడిపల్లి ల చిత్రం ఓపెనింగ్‌లో కూడా మెహర్ రమేష్ బాగా సందడి చేశాడంటే.. ఇదే సంగతి. మరి స్నేహం బిజినెస్‌ల వరకేనా? లేక తెగించి ఆయనకు దర్శకత్వ ఛాన్స్ ఏమైనా మహేష్ ఇస్తాడా? అన్నది హాట్ న్యూస్‌గా మారింది...!