డైరెక్టర్స్ లో చందు మొండేటి స్టయిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నిఖిల్ తో 'కార్తికేయ' తీసి హిట్ కొట్టిన చందు మొండేటి, నాగ చైతన్యతో మలయాళ 'ప్రేమామ్' ని తెలుగులో 'ప్రేమమ్' గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. మరి చందు మొండేటి మూడో సినిమాని ఎవరితో చెయ్యబోతున్నాడు.... ఆ సినిమా టైటిల్ ఏంటి అని అందరూ కొంచెం ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. అందులోను 'ప్రేమమ్' వచ్చి అప్పుడే ఏడాది దాటిపోయింది కూడా. అయితే చందు మొండేటి ఒక కొత్త కథను తయారు చేసి తన రెండో సినిమా హీరోతోనే మూడో సినిమాని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. నాగ చైతన్య హీరోగా చందు ఒక కొత్త కాన్సెప్ట్ తో టైటిల్ కూడా కొత్తగా ఉండేలా 'సవ్యసాచి' అని పెట్టాడు.
ఈ చిత్రం ఈరోజు బుధవారమే పూజ కార్యక్రమాలతో ఆఫిసియల్ గా సెట్స్ మీదకి వెళ్లబోతుంది. మరి సినిమా ఓపెనింగ్ తో పాటే ఫస్ట్ లుక్ ని కూడా వదిలేశారు. ఆ ఫస్ట్ లుక్ లో చైతు ఉన్నాడు చూడండి. ఇక 'సవ్యసాచి' అంటే అర్ధం రెండు చేతులతో ఏ పనైనా చేసేవాడిని 'సవ్యసాచి' అంటారు. మరి 'సవ్యసాచి' టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ లుక్ కూడా ఉంది. నాగ చైతన్య వెనుకగా తన రెండు చేతుల్లోనూ చెరో బాణాన్ని పట్టుకున్నట్లు ఫస్ట్ లుక్ ని డిజైన్ చేశారు. మరి నాగ చైతన్య రెండు చేతులతో బాణాలు పట్టుకుని యుద్దానికి దిగుతున్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్ ని, టైటిల్ ని చూస్తుంటే మాత్రం చైతు - చందులు హిట్ కొట్టేలాగే కనబడుతున్నారు.
చందు మొండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య నటిస్తున్న ఈ 'సవ్యసాచి' మాత్రం ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని ఈ టైటిల్ లోగోని బట్టి అర్ధమవుతుంది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలతో సినిమాలు చేసిన మైత్రి మూవీస్ వారు మొదటిసారి నాగ చైతన్య సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే 'సవ్యసాచి' చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా హీరోయిన్ ఫైనల్ కావాల్సి ఉంది.