Advertisementt

పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా..!

Wed 16th Aug 2017 05:54 PM
pawan kalyan,trivikram srinivas,september 2,pawan kalyan birthday  పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా..!
Pawan and Trivikram Srinivas Movie Update పవన్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీకి సంబందించిన అప్ డేట్ కోసం పవన్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా మొదలయ్యి చాలా కాలమైనా కూడా ఇప్పటివరకు ఆ సినిమాపై ఎటువంటి న్యూస్ మీడియాకి అందడం లేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి పవన్, త్రివిక్రమ్ చిత్రం గురించిన అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సినిమా మొదలై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు టైటిల్  కూడా ప్రకటించకుండా సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్న త్రివిక్రమ్.. ఈ ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా పవన్ ఫస్ట్ లుక్ వదులుతారనే ప్రచారం జరిగింది.

ఇక స్వాతంత్ర్య దినోత్సవం రోజు కంటే కూడా పవన్ పుట్టిన రోజుకు ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తే బాగుంటుందని యూనిట్ సభ్యులందరూ తమ అభిప్రాయం వ్యక్తం చేయడంతో త్రివిక్రమ్ కి కూడా వారి ఆలోచనే నచ్చి అలా ప్రొసీడ్ అవడానికి మొగ్గు చూపడంతో  ప్రస్తుతానికి పవన్ ఫస్ట్ లుక్ ఆగింది. కానీ ఆగష్టు 15 న పవన్ సినిమా గురించి ఎటువంటి న్యూస్ బయటికి రాకపోయేసరికి పవన్ ఫాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. అయితే పవన్ ఫాన్స్ నిరాశ పడడం చూసిన పవన్ కళ్యాణ్ తన సినిమాకి సంబందించిన టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఫాన్స్ కి భరోసా ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. 

అంతేకాదు త్రివిక్రమ్, చిత్ర యూనిట్ ఆలోచన ప్రకారం సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు కానుకగా సినిమా టైటిల్ అనౌన్స్ చేసి.. ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేస్తారని సమాచారం బయటికి వచ్చింది. మరి పవన్ - త్రివిక్రమ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇక టైటిల్, ఫస్ట్ లుక్ బయటికొస్తే ఆ అంచనాలు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని పవన్ ఫ్యాన్స్ ఉహించేసుకుంటున్నారు. ఇప్పటికే శాటిలైట్ రైట్స్, ప్రీ రిలీజ్ బిజినెస్ తో అదిరిపోయే లెవల్లో రికార్డు సృష్టిస్తున్న పవన్, త్రివిక్రమ్ లు ఈ టైటిల్, ఫస్ట్ లుక్ లతో ఇంకెంత రచ్చ చేస్తారో చూద్దాం.

Pawan and Trivikram Srinivas Movie Update:

Pawan Kalyan and Trivikram Srinivas Movie First Look and Title Release on Pawan Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ