కొన్నిసార్లు, కొందరు హీరోల చిత్రాల విషయంలో ఎందుకు ఏమిటో తెలియకుండా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతూ, అందరినీ అయోమయానికి గురి చేస్తూ అందరిలో లేనిపోని అనుమానపు బీజాలను నాటుతుంటాయి. అలాంటి వార్త ఒకటి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రం విషయంలో హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్ ఒకవైపు బిగ్‌బాస్ రియాల్టీ షోతో పాటు 'జై లవ కుశ'లో త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ఈ ట్రిపుల్ క్యారెక్టర్ వలన ఈ చిత్రం రిలీజ్ డేట్‌కి విడుదల కాదని, కాస్త ఆలస్యమవుతుందని వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి 'జై లవ కుశ' చిత్రం సెప్టెంబర్ 21న విడుదల అవుతుందని ప్రకటించారు. కానీ మొన్నటి వరకు బాలయ్య 'పైసా వసూల్' వల్ల కాస్తైనా అభిమానులకు అనుమానాలుండేవి. కానీ బాలయ్య కూడా దాదాపు ఓ నెల ముందుకి అంటే ఏకంగా సెప్టెంబర్1కి వచ్చేయడంతో ఇక ఎన్టీఆర్ 'జై లవ కుశ'కి అడ్డేలేదు. 'స్పైడర్' కంటే ఓ వారం ముందుగానే దసరా పండుగను తేవడానికి జూనియర్ రెడీ అయిపోతున్నాడు.
కానీ బిగ్‌బాస్‌షో తో పాటు 'జై లవ కుశ' షూటింగ్‌లో ఆలస్యం వల్ల ఈ చిత్రం వాయిదా ఖాయమంటూ వార్తలు వచ్చాయి. చిత్రంగా అదే తేదీన శర్వానంద్-మారుతిల 'మహానుభాహుడు' రిలీజ్ అవుతుందని వార్తలు రావడం మరో విశేషం. కానీ ఈ విషయంపై నిర్మాత, ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్ క్లారిటీ ఇచ్చేశాడు. 'జై లవ కుశ' చిత్రం సెప్టెంబర్ 21న విడుదల కావడం గ్యారంటీ అని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని, ఇక ఈ చిత్రంలోని లవ క్యారెక్టర్ టీజర్‌ని కూడా ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటిస్తామని తేల్చేశాడు.
ఇక ఇప్పటికే 'జై' పాత్ర టీజర్ అద్భుతంగా ఆకట్టుకోగా, ' లవకుమార్' పాత్ర లవ్లీ అండ్ కూల్‌గా ఉంటుందని అర్దమైంది. అయినా ఈ పాత్రకి సంబంధించిన టీజర్ కూడా మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండటం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఇందులోని మూడూ పాత్రలు వేటికవే సెన్సేషనల్‌గా, ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించే విధంగా ఉంటాయని దర్శకుడు బాబి కూడా ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు. ఇక ఈ చిత్రంలో నివేధాథామస్, రాఖిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.