అనుకోకుండా సెప్టెంబర్ చివరి నుంచి బాలయ్య-జగన్‌ల 'పైసా వసూల్' ఒక నెల ముందుగా సెప్టెంబర్1కి వచ్చేసింది. దీంతో పిల్లికి చెలగాటం...ఎలుకకి ప్రాణ సంకటంగా మారింది 'జవాన్' పరిస్థితి. మంచి కాన్సెప్ట్‌తో యాక్షన్ విత్ ఎమోషనల్ డ్రామాగా వస్తున్నామని 'జవాన్' టీం అంటోంది. ఇప్పటికే కాస్త గాడితప్పి 'తిక్క, విన్నర్'లతో సాయిధరమ్‌తేజ్ దెబ్బతిన్నాడు. మంచికిపోయి రెమ్యూనరేషన్ లేకపోయినా మంచి పేరు వస్తుందనే ఆశలో కృష్ణవంశీ 'నక్షత్రం'కి నెల అంకితమైపోయాడు. పేరు రాకపోగా హ్యాట్రిక్‌ఫ్లాప్ అనే చెడ్డ పేరు మాత్రం వచ్చింది. దీంతో మరలా తనదైన మాస్ స్టైల్‌ని చూపించడానికి 'జవాన్'గా మారి రచయిత బి.వి.ఎస్. రవితో వస్తున్నాడు.
ఆల్‌రెడీ 'వాంటెడ్'తో పరువు పోగొట్టుకుని, రచయిత నుంచి దర్శకులుగా మారి సత్తా చూపలేకపోయిన దర్శకుడిగా రవికి పేరుపడింది. 'వాంటెడ్' తర్వాత మరలా డైరెక్షన్ పేరు ఎత్తలేదు. కానీ ఇప్పుడు మెగా మేనల్లుడు పుణ్యమా అని మంచి కథతో 'జవాన్'తో తనని తాను నిరూపించుకోవాలని చాలా ధృడంగా వున్నాడు. అయితే ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్ 1న విడుదల చేయాలని భావించారు. కానీ అదే స్థానంలోకి 'పైసా వసూల్' వచ్చి చేరింది. సాయిధరమ్‌తేజ్ ఎంత మాస్ హీరో అయినా బాలయ్యకు ఎదురు పోలేడు కదా...! అందుకే కాస్త తీరిగ్గా ఆలోచించుకుని నవంబర్ 1 లేదా 8 వతేదీన రావాలనుకుంటున్నాడు. అంటే ఏకంగా నెలరోజులుపైనే గ్యాప్ తీసుకున్నాడు. ఫ్లాప్‌ల హీరో, ఫ్లాప్ దర్శకుడు కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త తప్పనిసరే.
ఇక ఇందులో 'కృష్ణగాడి వీరప్రేమగాధ'లో నటించిన మెహ్రీన్ నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాస్త పెద్ద తోడుగా ఉంటాడని దిల్‌రాజుని సమర్పకునిగా పెట్టుకున్నారు. కృష్ణ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్‌తో బాగానే ఆసక్తికిని రేపుతోంది. మరి ఈ చిత్రమైనా సాయిధరమ్‌తేజ్‌కి వరుణ్‌తేజ్‌కి 'ఫిదా'లా మంచి హిట్‌ని ఇచ్చి 50కోట్ల క్లబ్‌లో చేరుస్తుందేమో వేచి చూడాల్సివుంది!