బిగ్‌బాస్ షో ప్రారంభం సమయంలో పార్టిసిపెంట్స్‌ని ఎంపిక చేసినప్పుడు అందరి దృష్టి సంపూర్ణేష్‌బాబుపైనే ఉంది. సినిమాలలలో రెచ్చిపోయి నటన, తనదైన కామెడీ సృష్టించే ఈ బర్నింగ్‌స్టార్ బిగ్‌బాస్ షోలోనూ అదే ఫీట్‌ని రిపీట్ చేస్తాడని అందరూ భావించారు. కానీ విడిగా ఎంతో సరదాగా, ఎంతో కామెడీగా ఉండే సంపూర్ణేష్‌బాబు బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం డల్‌గా ఉండి, ఆయన నుంచి ఏవోవో ఆశించిన వారందరినీ నిరుత్సాహ పరిచారు.
ఇక సంపూకు బిగ్‌బాస్‌లో ఉన్న మిగిలిన పార్టిసిపెంట్స్‌లో ఎక్కువ క్లోజ్ కత్తి మహేష్ అనే చెప్పాలి. ఆయన దర్శకత్వం వహించిన 'పెసరట్టు' చిత్రంలో సంపూ ఓ పాత్రను కూడా చేశాడు. ఇక సంపూర్ణేష్ నటించిన 'హృదయకాలేయం, కొబ్బరిమట్ట' చిత్రాలలో కత్తి మహేష్ నటించాడు. ఇక సంపూకి ఊరంతా సరదాగా తిరుగుతూ, అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించే మనస్తత్వమని, అలాంటి స్వేఛ్చలో ఉండే సంపూ ఓ గదిలో బంధించబడినట్లు ఫీలయ్యాడని, దాంతో ఆయన మానసికంగా ఎంతో వేదనకు గురయ్యాడని, హౌస్‌లోపల ఉండే ఒత్తిడిని తట్టుకోలేక మానసికంగా ఎంతో నరకం అనుభవించాడని మరో పార్టిసిపెంట్, రీసెంట్ గా ఎలిమినేషన్ ద్వారా బయటికి వచ్చిన కత్తి మహేష్ తెలిపాడు.
సంపూ చాలా సెన్సిటివ్ కావడంతో ఆ వాతావరణాన్ని ఆయన తట్టుకోలేకపోయి, బేలగా కనిపించేవాడని, షో నుంచి బయటకు వెళ్లితే అతనికి, షోకి కూడా నష్టమని ఎందరు సర్దిచెప్పినా ఆయన వినిపించుకోలేదని, ఇక తన పిల్లలకు ఏదో అయిందని కల కూడా వచ్చిందని తెగ టెన్షన్ పడిపోవడంతో మిగిలిన పార్టిసిపెంట్స్ కూడా ఏమీ చేయలేక ఆయన పరిస్థితి గమనించి మౌనంగా ఉండిపోయామని మహేష్ చెప్పుకొచ్చాడు.
ఆయనకు నచ్చినట్లే చేయడం తప్ప మరే విధంగానూ నచ్చ జెప్పే అవకాశం మాకు లేకపోయిందని, అలా సంపూ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడని కత్తి మహేష్ అసలు విషయం చెప్పేశాడు.