స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌కి మలయాళంలో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్నాయి. తెలుగులో ఫ్లాప్ అయిన 'బద్రినాథ్' చిత్రం కూడా అక్కడ బాగా ఆడేసింది. కాగా ఈనెల 11న అల్లుఅర్జున్ - హరీష్‌శంకర్- దిల్‌రాజుల డిజె దువ్వాడ జగన్నాథంను అక్కడ విడుదల చేశారు. ఈచిత్రం అక్కడ 'ద్రువరాజ జగన్నాథం' పేరుతో విడుదలైంది. అక్కడ అల్లుఅర్జున్ చేసే స్టైలిష్ యాక్షన్ అన్నా, స్టైలిష్ డ్యాన్స్, నటన అన్నా యూత్ విపరీతంగా ఆదరిస్తారు.
ఇక ఈ చిత్రంకి తెలుగులో నెగటివ్ రివ్యూలు వచ్చినా, కలెక్షన్లపరంగా 70కోట్లకు పైగా షేర్ వసూలు చేసి కలెక్షన్ల కుమ్ముడు కుమ్మేసింది. బయ్యర్లకు పెద్దగా లాభాలు రాకపోయినా నష్టాలు రాకుండా లెక్కలు సరిచేసింది. ఇక ఓవర్‌సీస్‌లో మాత్రం నష్టాలు తప్పలేదు. ఇక ఈనెల 11న విడుదలైన ఈ చిత్రం మలయాళ వెర్షన్ కూడా తెలుగుకు పోటీనా అన్నట్లుగా ఆడుతోంది. అక్కడ రివ్యూలు కూడా యావరేజ్‌గానే వచ్చాయి. కానీ దాని ప్రభావం కలెక్షన్ల మీద లేదు. మొదటి వీకెండ్‌లోనే ఈ చిత్రం ఏకంగా 1.5 కోట్ల దాకా వసూలు చేసిందట.
బన్నీ కిందటి చిత్రం 'సరైనోడు' ఇక్కడ దాదాపు 4కోట్లకుపైగా వసూలు చేసింది. విడుదలలో ఆలస్యమైనా కూడా 'డిజె' కూడా అదేకోవలో ఇక్కడ 'సరైనోడు'ని మించిన కలెక్షన్లను సాధించడం ఖాయమంటున్నారు. మొత్తానికి బన్నీ హవా, అదృష్టం ఆ రేంజ్‌లో ఉన్నాయని ఒప్పుకోవాల్సిందేమరి...! ఇక ఈచిత్రంలోని పాటలు, మరీ ముఖ్యంగా పూజాహెగ్డే అందాలకు అక్కడి యువతరం ప్రేక్షకులు మంత్రముగ్దులైపోతున్నారు.