'జనతా గ్యారేజ్' వచ్చిన ఆరు నెలలకు బాబీ డైరెక్షన్ లో 'జై లవ కుశ' ను స్టార్ట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి మాత్రం తన సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకోనని... సినిమా అయినా వెంటనే సినిమాను లైన్లో పెట్టేస్తానని చెప్పడమే కాదు ఆ పని చేసేస్తున్నాడు కూడా. 'జై లవ కుశ' చిత్రం కాగానే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయిన ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత కొరటాలకు.... ఆ తర్వాత మరో డైరెక్టర్ కి కమిట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి తో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
‘ఐతే, అనుకోకుండా ఒక రోజు, సాహసం, మనమంతా’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడు మొదటి సారి ఒక స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రశేఖర్ యేలేటి చెప్పిన స్టోరీ లైన్ ఎన్టీఆర్ కి నచ్చడంతో వెంటనే దీన్ని డెవలప్ చెయ్యమని... యేలేటి కి ఎన్టీఆర్ సూచించినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు పూర్తికాగానే ఈసినిమా చేద్దామని చంద్రశేఖర్ కి ఎన్టీఆర్ మాట కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి వైవిద్యమైన కథలతో ప్రేక్షకులకు ఎప్పటికప్పుడే కొత్తదనాన్ని పరిచయం చేస్తున్న ఎన్టీఆర్ - యేలేటి కాంబోలో తెరకెక్కే మూవీ ఎలా వుండబోతుందో అంటూ అప్పుడే ఎన్టీఆర్ అభిమానులే కాదు సినిమా ఇండస్ట్రీ అంతా తెగ ఆలోచించేస్తున్నారు .
ఇక ఎన్టీఆర్ కూడా బాబీ డైరేక్షన్ లో చేస్తున్న 'జై లవ కుశ'ను సెప్టెంబర్ 21 న విడుదల చెయ్యడమే ఆలస్యం.. త్రివిక్రమ్ మూవీకి జంప్ అవడానికి రెడీగా వున్నాడు. మరి అప్పటికి త్రివిక్రమ్, పవన్ చిత్రాన్ని ఫినిష్ చేయగలడా? అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేని ప్రశ్నే. మరి త్రివిక్రమ్ తో సినిమా అయ్యాక కొరటాలతో కూడా ఒక సినిమాకి కమిట్ అయిన ఎన్టీఆర్... ఆ సినిమా కూడా వచ్చే ఏడాది చివర్లోగాని మొదలయ్యేలా లేదు. ఎందుకంటే కొరటాల - మహేష్ కాంబోలో వస్తున్న 'భరత్ అనే నేను' పూర్తయ్యాక కొరటాల శివ, రామ్ చరణ్ తో మూవీకి కమిట్ అవ్వడమే కాదు ఆఫీషియల్ గా ప్రకటన కూడా ఇప్పించేశారు. ఈ లెక్కన ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమ తర్వాత యేలేటితో నటించే ఛాన్స్ ఎక్కువగా వుంది. చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో...!