రవితేజ, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న 'రాజా ది గ్రేట్' టీజర్ ని 71 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో విడుదల చేశారు. మాస్ మహరాజ్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రవితేజ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. 25 ఏళ్లుగా అంధుడిగానే కనబడనున్న ఈ చిత్రంలో రవితేజ డైలాగ్ డెలివరీ, ఎనర్జీ లెవల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు అని ఒక వాయిస్ ఓవర్ వినపడగానే వెంటనే రవితేజ.. నోర్ముయ్ ఆ నయనాలు లేకుండా పాతికేళ్ళ నుండి కుమ్మేత్నానిక్కడ.... సర్వేంద్రియానం సర్వం ప్రధానం.. అంటూ రవితేక మార్క్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా... సినిమాపై అంచనాలు పెంచేలా వుంది.
ఇక కళ్ళు లేకపోయినా తెలివితేటలతో ఈ ప్రపంచంలో జీవించడం చాలా తేలిక అని చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు.... కానీ నా కొడుకేంటో ఈ ప్రపంచం చూడాలంటూ రవితేజ తల్లి పాత్రలో రాధికా చెప్పే తీరు.... ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రో కబడ్డీ మ్యానియాతో పడి కొట్టుకుపోతున్న నేపథ్యంలో డైరెక్టర్ ఈ సినిమాలో రవితేజని కబడ్డీ ప్లేయర్ గా చూపించడం వంటి కొత్త అంశాలతో 'రాజా ద గ్రేట్' టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ టీజర్ లో ప్రకాష్ రాజ్ ని, సంపత్ ని పోలీస్ లుగా చూపించి.... హీరోయిన్ మెహరీన్ ని మాత్రం ఆవేశంగా ట్రైన్ పక్కనే పరిగెడుతున్న స్టయిల్లో పరిచయం చేశాడు. 'ఐ యామ్ బ్లైండ్.. బట్ ఐ యామ్ ట్రైన్డ్' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ చూస్తుంటే రవితేజలో ఎనర్జీ లెవల్స్ ఏ మాత్రం తగ్గలేదనిపిస్తుంది.
రవితేజ ముఖంలో కాస్త గ్లో తగ్గినా కూడా అతని ఎనర్జీతో దాన్ని కప్పెట్టేశాడు. మరి ఈ టీజర్ చూస్తుంటే మాత్రం రవితేజ ఎక్కువ గ్యాప్ తీసుకున్నా.. అంధుడిగా కొత్తగా ఒక ప్రయోగం చేసినప్పటికీ మంచి కథతో ఆకట్టుకుని హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు. టోటల్ గా ఈ టీజర్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ని తలపిస్తున్నా.. ఇందులో ఏదో ఉండబోతుంది అనే క్యూరియాసిటీ ని అయితే కలిగిస్తుంది.
'రాజా ది గ్రేట్' టీజర్ ట్యాగ్ లైన్ : సర్వేంద్రియానం సర్వం ప్రధానం