Advertisementt

ఎన్టీఆర్ ని భయపెట్టేటంతటి వాడయ్యాడు!

Tue 15th Aug 2017 06:08 PM
varun tej,fidaa,jr ntr,nannaku prematho,overseas  ఎన్టీఆర్ ని భయపెట్టేటంతటి వాడయ్యాడు!
Varun Tej Fidaa To Push Jr NTR Nannaku Prematho From Top 7 ఎన్టీఆర్ ని భయపెట్టేటంతటి వాడయ్యాడు!
Advertisement
Ads by CJ

యంగ్ స్టర్స్ అందరిలో ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు కూడా మూడు విభిన్న పాత్రల్లో 'జై లవ కుశ'లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. అలాగే 'జై లవ కుశ' ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరిగిందనే టాక్ వినబడుతుంది. అలాగే ఎన్టీఆర్ మరోపక్క బుల్లితెర మీద బిగ్ బాస్ కి హోస్ట్ గా అదరగొట్టే పెరఫార్మెన్సు తో ఆకట్టుకుంటున్నాడు. మరింతలా ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ని భయపెట్టే వాడెవడ్రా..! అనుకుంటున్నారా? ఇంకెవరు నిన్నగాక మొన్న ఇండస్ట్రీలో అడుగుపెట్టి కేవలం ఐదే సినిమాలు చేసిన మెగా హీరో వరుణ్ తేజ్.

ఎన్టీఆర్ ని వరుణ్ ఎలా భయపెడుతున్నాడు అంటే... వరుణ్ తేజ్ తాజాగా నటించిన 'ఫిదా' చిత్రం విడుదలైన అన్నిచోట్లా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ కొల్లగొడుతుంది. బాక్సాఫీస్ బొనాంజాగా 'ఫిదా' చిత్రం దూసుకుపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఫిదా' చిత్రం ఇప్పటికే 30 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే 2  మిలియన్ డాలర్స్ క్లబ్బులోకి చేరిపోయి స్టార్ హీరోలకు అక్కడ చమటలు పట్టించడానికి రెడీ అయ్యింది. ఈ దెబ్బకి స్టార్ హీరోలు కూడా క్రాస్ చెయ్యలేని కొన్ని రికార్డులని 'ఫిదా' చిత్రం కొల్లగొట్టేసింది. అలాగే 'ఫిదా' చిత్రం ఇప్పుడు ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' రికార్డుని తుడిచెయ్యడానికి రెడీ అయ్యింది. 

'నాన్నకు పేమతో' చిత్రం యూఎస్ లో 2.02  మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే అక్కడ ఆల్ టైం రికార్డుగా నిలిచిన రికార్డును 'ఫిదా' చిత్రం సునాయాసంగా బద్దలు కొట్టెయ్యడానికి కాచుక్కూర్చుంది. తాజాగా ఓవర్సీస్ లో 'లై, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక' చిత్రాలు విడుదలైనప్పటి 'ఫిదా' కలెక్షన్స్ ఏ మాత్రం డ్రాప్ అవ్వలేదని.... ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' రికార్డును అతి త్వరలోనే తుడిచేసి ఎన్టీఆర్ రికార్డు కి ఫిదా ఎసరు పెట్టేస్తుందంటున్నారు.

Varun Tej Fidaa To Push Jr NTR Nannaku Prematho From Top 7:

Varun Tej joined 2 Million dollar club with Fidaa being in top 7, next position the film is eyeing big will be top 6 which means Jr NTR’s Nannaku Prematho record is currently under threat.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ