చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత ఎంతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150' ఈ ఏడాది మొదట్లో విడుదల అవడము, ఆ సినిమా హిట్ అవడము జరిగింది. 150 తర్వాత చిరు 151 వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మితమవుతుందని ఎప్పుడో అనగా ఐదు నెలల ముందే ప్రకటన వచ్చింది. సినిమా వచ్చిన ఆరేడు నెలలు గడుస్తున్నా.. ఉయ్యాలవాడని ఇదిగో మొదలెడుతున్నాం... అదిగో మొదలెడుతున్నాం అంటున్నారే గాని.... ఈ సినిమా మొదలయ్యే డేట్ మాత్రం ఎనౌన్స్ చేయడంలేదు. ఆఖరికి చిరంజీవి పుట్టినరోజు రోజున ఉయ్యాలవాడ పూజా కార్యక్రమాలు జరుగుతాయనే ప్రచారం గట్టిగా జరిగింది.
అయితే ఇప్పుడు చిరు బర్త్ డే ఆగష్టు 22 న కూడా ఉయ్యాలవాడ పట్టాలెక్కే ఛాన్స్ కనబడడం లేదు. కారణం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరింత ఆలస్యమవుతుండటంతో ప్రారంభోత్సవానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇప్పటివరకు మెగా ఫాన్స్ ని అంతగా ఊరించి ఊరించి వదిలిన ఉయ్యాలవాడ టీమ్ చిరు బర్త్ డే కి సినిమా మొదలు పెట్టకపోతే ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ రోజు అంటే ఆగష్టు 22 న ఎలాగైనా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లోగోను లాంచ్ చేద్దామనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందనే టాక్ వినబడుతుంది.
అందుకోసం ఇప్పటికే ఓ పవర్ ఫుల్ లోగో రెడీ అయినట్లు సమాచారం అందుతుంది. ఉయ్యాలవాడ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినా ప్రి ప్రొడక్షన్ పనులు ఆలస్యం వల్లనే ఉయ్యాలవాడ మొదలవ్వడానికి లేట్ పడుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం ఫైనల్ గా సెట్స్ మీదకెళ్లడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం స్టార్ట్ అయ్యింది. ఇకపోతే ఈ చిత్రంలో చిరుకి జోడిగా నయనతారని ఫైనల్ చేసినట్లు చెబుతున్నప్పటికీ చిత్ర టీమ్ ఇంకా హీరోయిన్ వేట కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఉయ్యాలవాడని మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఈ చిత్రానికి అందరూ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తే సినిమాకి విపరీతమైన క్రేజ్ వస్తుంది కాబట్టి చిత్ర యూనిట్ అటువైపు ఆలోచనలో కూడా ఉందట.