Advertisementt

ఎనకటికెవడో అన్నట్టుంది..కదా రామ్ చరణ్..!

Tue 15th Aug 2017 04:26 PM
ram charan,maniratnam,sara ali khan,ram charan and maniratnam movie  ఎనకటికెవడో అన్నట్టుంది..కదా రామ్ చరణ్..!
Ram Charan and Maniratnam Movie News again Hulchal ఎనకటికెవడో అన్నట్టుంది..కదా రామ్ చరణ్..!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్ లో 'రంగస్థలం 1985' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పల్లెటూరి ప్రేమ కథగా ఉండబోతుంది. గ్రామీణ వాతావరణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతానికి 'రంగస్థలం' షూటింగ్ శరవేగంగా  జరుపుకుంటుంది. ఇకపోతే 'రంగస్థలం' చిత్రంలో హీరోగా చేస్తున్న రామ్ చరణ్ మరోవైపు తన తండ్రి 151 వ సినిమా 'ఉయ్యాలవాడ'ని కూడా నిర్మిస్తున్నాడు. 

మరోపక్క రామ్ చరణ్, మణిరత్నం కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. మద్య మధ్యలో అసలు మణిరత్నంతో చరణ్ పనిచెయ్యడనే న్యూస్ కూడా వినబడుతుంది. ప్లాపుల బాటలో ఉన్న మణిరత్నంతో రామ్ చరణ్ సినిమా చెయ్యడమేమిటంటూ కొందరంటుంటే, మరికొందరు వీరిద్దరి కాంబోలో ఖచ్చితంగా సినిమా ఉంటుందంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మణిరత్నం, రామ్ చరణ్ కాంబో పై ఒక ఆసక్తికర పుకారు రేజ్ అయ్యింది. అసలా పుకారు చూస్తే మీకు దిమ్మతిరిగిద్ది. చరణ్ తో చెయ్యబోయే చిత్రాన్ని మణిరత్నం తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లోనూ ప్లాన్ చేస్తున్నాడట.

మరి మూడు భాషల్లో సినిమాని తెరకెక్కిస్తున్నాడు అంటే మూడు భాషల్లో పరిచయమున్న హీరోయిన్ ని రామ్ చరణ్ పక్కన నటింపచేయడానికి మణిరత్నం ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసాడని..... ఈ నేపథ్యంలో చరణ్ పక్కన హీరోయిన్‌గా సైఫ్ ఆలీఖాన్ కూతురు సారాని తీసుకుంటారనే పుకార్లు వినబడుతున్నాయి. అసలు మణి - చరణ్ మూవీ పై ఎటువంటి అధికారిక అప్ డేట్ లేదు అప్పుడే చరణ్ పక్కన హీరోయిన్ ని కూడా సెట్ అయ్యిందంటూ న్యూసొకటి. ఇదంతా చూస్తుంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు లేదు.

Ram Charan and Maniratnam Movie News again Hulchal:

Saif Ali Khan Daughter Sara Ali Khan in Charan and Maniratnam Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ