నేనే రాజు నేనే మంత్రి మూవీ విడుదలైన ప్రతి చోటా మంచి టాక్ తో, కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇది విడుదల తర్వాత ఈ చిత్రం సంగతి. విడుదలకు ముందు అంటే ఈ చిత్ర కథ అనుకున్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి తాజాగా తేజ భయపెట్టాడు.
ఈ చిత్ర కథను మొదట తేజ.. రానాకి చెప్పగా ఓకే చేశాడట. కానీ సురేష్‌బాబు పిలిచి కొన్ని మార్పులు చేర్పులు చేయమని తేజకి చెప్పాడట. దాంతో తేజ.. రానా వద్దకు వచ్చి ఈ సినిమాకి సురేష్‌బాబు అవసరం లేదు. వేరే నిర్మాత రెడీగా ఉన్నాడని కోపంగా చెప్పేశాడట. అనంతరం తనను గెస్ట్ హౌస్‌కి పిలిపించారని, అక్కడ సురేష్‌బాబు, రానా ఇద్దరు ఉన్నారని, కొన్ని మార్పులు చేయడానికి తాను ఓకే చెప్పినా, తనకు నచ్చినట్లు తీసే స్వేఛ్చ తనకి ఇవ్వాలని గట్టిగానే సురేష్‌బాబుకి, రానాకి ముందుగానే తేజ చెప్పేశాడట.
సక్సెస్‌ల్లో ఉన్నప్పుడు ఏ దర్శకుడైనా.. సురేష్‌బాబు వంటి నిర్మాతలకు అలా చెప్పడం ఊహించగలం గానీ, వరుస ఫ్లాప్‌లలో ఉన్న తేజ.. సురేష్‌బాబుకి అంత నిర్భయంగా చెప్పాడంటే మాత్రం తేజను, అతని ఘట్స్ ని మెచ్చుకుని తీరాల్సిందే..! దర్శకుడికేం ఉండాలో డైరెక్టర్ తేజ చూపించాడు.