Advertisementt

వీరిద్దరూ లుంగీ కడుతుంటే..భలే వుంది!

Mon 14th Aug 2017 11:23 PM
rana,venkatesh,nene raju nene mantri,lungi,lungi dance  వీరిద్దరూ లుంగీ కడుతుంటే..భలే వుంది!
Venkatesh and Daggubati Rana Lungi dance వీరిద్దరూ లుంగీ కడుతుంటే..భలే వుంది!
Advertisement
Ads by CJ

తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, కాజల్‌, కేధరిన్‌లు నటించిన 'నేనే రాజు -నేనే మంత్రి'కి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. ఇంతకు ముందు రానా సోలో హీరో అంటే పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ బాహుబలితో పరిస్థితి మారింది. కమర్షియల్‌ హంగులే లేని 'ఘాజీ' కూడా బాగానే కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక 'నేనే రాజు నేనే మంత్రి'లో జోగేంద్ర నటనకు మంచి ప్రశంసలే లభిస్తున్నాయి.

వర్మ సైతం తాను 'డిపార్ట్‌మెంట్‌'తో ఇవ్వలేని బ్రేక్‌ని తేజ ఇచ్చాడని మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక రెగ్యులర్‌ హీరోగా, కమర్షియల్‌ హీరోగా కూడా రానా దగ్గుబాటి కెరీర్‌ గాడిలో పడినట్లేనని చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో తెల్లని పంచెని పైకి కట్టి పొగరుగా రానా చూపిన ప్రతిభ బాగుంది. 

తాజాగా రానా తన బాబాయ్‌ విక్టరీ వెంకటేష్‌తో కలిసి అలా పంచె కట్టె సీన్‌ని ఆయనతో కలిసి చేసి, పోస్ట్‌ చేయగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నా విజయాన్ని నా బాబాయ్‌తో ఇలా పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని, నేను ఎంచుకున్న చిత్రాలకు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి ఎంతో రుణపడి ఉన్నానని రానా తెలిపాడు. 

Venkatesh and Daggubati Rana Lungi dance:

Rana and Venkatesh Promotes Nene Raju Nene Mantri Movie with Lungi 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ