తన మొదటి చిత్రం 'అఖిల్' తోనే ఒకే సినిమాతో రాత్రికి రాత్రి ఓవర్‌నైట్ స్టార్‌గా, అక్కినేని వంశంలో ఎవ్వరూ సాధించలేని మాస్ ఇమేజ్‌ని తన తొలి చిత్రంతోనే పొందాలని భావించిన అఖిల్.. లోకరక్షకుని అవతారం ఎత్తి, వినాయక్, నితిన్‌లతో కలిసి డిజాస్టర్‌గా దెబ్బతిన్నాడు. దాంతో బుద్దిగా తనతండ్రి చెప్పినట్లు నడుచుకోవడానికి రెడీ అయి తన రెండో చిత్రాన్ని రీలాంచ్‌గా భావిస్తూ.. తమ ఫ్యామిలీకి 'మనం' వంటి ఇంటెలిజంట్ మాస్టర్ పీస్‌ని అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నాగార్జున తన సొంతబేనర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మిస్తుండగా, విక్రమ్ కె.కుమార్ దర్శకుడు కావడంతో ఇందులో ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఈ చిత్రానికి సూపర్ సినిమాటోగ్రాఫర్ పి.ఎస్, వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ హరోయిన్‌గా పరిచయం కానుంది. టబు.. అఖిల్‌కి తల్లిగా నటిస్తుండగా మరో కీలకపాత్రలో జగపతిబాబు నటిస్తుండటం విశేషం. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలోని షూటింగ్ స్పాట్‌కి వెళ్లి కాస్త రష్ చూసి ఎంతగానో ఆనందించిన నాగార్జున.. విక్రమ్‌ని, వినోద్‌లను ప్రశంసలతో ముంచెత్తి తనకు అచ్చి వచ్చిన క్రిస్మస్, డిసెంబర్ సీజన్‌లను చూసుకుని డిసెంబర్ 22న విడుదల అంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు.
మరోవైపు ఈ చిత్రానికి 'జున్ను, రంగులరాట్నం' అనే టైటిల్స్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు టెటిల్స్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో ఫిల్మ్‌చాంబర్‌లో రిజిష్టర్ చేయించారు. ఈ చిత్రంలో అఖిల్ పాత్ర ముద్దు పేరు జున్ను కాబట్టి, కాస్త వినూత్నంగా ఈ టైటిల్ పెట్టాలని భావిస్తుంటే... మరింత విభిన్నంగా రంగులరాట్నం అనే టైటిల్ పెట్టవచ్చని వార్తలు వస్తున్నాయి. అఖిల్ రెండో సినిమా గురించి ఎప్పటినుండో అనేక రకాల వార్తలు, అనేకమంది డైరెక్టర్స్ మారిన నేపథ్యంలో.. ఇక ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అఖిల్ రెండో చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని టైటిల్‌తో సహా రివీల్ చేయనున్నారని సమాచారం. సో..అక్కినేని ఫ్యాన్స్ ఇప్పటి వరకు అఖిల్ విషయంలో చాలా ఓర్పుగా వున్నారు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టలేరా..!