నేటితరం దర్శకుల్లో ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తీసిన 'జయ జానకి నాయక' చిత్రం 'ఎ' సెంటర్స్‌లో ఏమో గానీ బి,సీ సెంటర్లలో మాత్రం మంచి కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఇందులోని యాక్షన్ సీన్స్‌కి, హీరోయిన్స్ గ్లామర్ షోకి కిందిస్థాయి ప్రేక్షకులు బాగా మంత్రముగ్దులవుతున్నారు. దీంతో బోయపాటి శ్రీనుతో చిత్రం చేయాల్సివున్న మెగాస్టార్ చిరంజీవి సైతం బోయపాటికి ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపాడట.
'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సమయంలో హరీష్‌శంకర్‌కి అల్లుఅర్జున్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. ఇంకేముంది 'డిజె' మొదలైంది. ఇప్పుడు బోయపాటి, మెగాస్టార్‌ల విషయంలో కూడా అదే జరగనుంది. ఇక చిరంజీవి తన 150వ చిత్రం 'ఖైదీనెంబర్ 150' తర్వాత బోయపాటితో సినిమా చేస్తాడని భావించారు. కానీ చిరుకి మైండ్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గట్టిగా పాతుకుని పోవడం, ఈ చిత్రం కోసం 'ధృవ' దర్శకుడు కూడా పరుచూరి బ్రదర్స్ తో కలిసి మెప్పించే స్క్రిప్ట్‌తో రెడీగా ఉండటంతో బోయపాటి శ్రీను చిత్రాన్ని కాస్త వాయిదావేసి తన 151వ చిత్రంగా రామ్‌చరణ్ నిర్మాతగా, కొణిదెల బేనర్‌లో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి చిరు శ్రీకారం చుట్టనున్నాడు.
ఇక బోయపాటి శ్రీనుకి.. బన్నీతో 'సరైనోడు' చేసిన వెంటనే అల్లుఅరవింద్ తన గీతాఆర్ట్స్ బేనర్‌లో మరో చిత్రం అగ్రిమెంట్ చేయించుకున్నాడు. మొత్తానికి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' తర్వాత బోయపాటి శ్రీను అల్లుఅరవింద్ నిర్మాతగా, గీతాఆర్ట్స్ బేనర్‌లో చిరు 152వ చిత్రంగా చిత్రం చేయడం కన్ఫర్మ్ అయినట్లే. బోయపాటి కూడా చిరుతో సినిమా ఉందని క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా విడుదలైన 'జయ జానకి నాయక' టాక్ కూడా పాజిటివ్ గా వుంది కాబట్టి..బోయపాటి, చిరుల కాంబో కి ఇక డౌట్ లేనట్లే. అయితే దీనికి మరో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే వుంది.