బాలకృష్ణ, పూరీ జగన్నాథ్‌ల చిత్రానికి 'పైసా వసూల్' అనే టైటిల్ పెట్టి.. ఇట్సే యాక్షన్ మూవీ అని బాలయ్య చేతనే పూరి డైలాగ్ చెప్పించాడు. ఇంతకీ ఈ టైటిల్‌నే పూరీ ఎందుకుపెట్టాడు? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇందులో బాలయ్య గ్యాంగ్‌స్టర్‌గా, ప్రజల డబ్బులను కొల్లగొట్టే వారి నుంచి ఆ డబ్బులను తిరిగి పేద ప్రజలకు ఇచ్చే గ్యాంగ్‌స్టర్ పాత్ర కావడం వల్లే దీనికి 'పైసా వసూల్' అని టైటిల్ పెట్టారని పలువురు భావిస్తున్నారు.
ఇక పూరీ, బాలయ్యల చిత్రం చూసిన వారు ఖచ్చితంగా 'పైసా వసూల్' మూవీ అని ఒప్పుకుంటారు కాబట్టి, ఆ కోణంలో కూడా ఈ టైటిల్ యాప్ట్‌గా అనిపించి ఉంటుంది. ఇక ఈ చిత్రం స్టంపర్ విడుదలకు ముందు పలువురు బయ్యర్లు సినిమాని కొనడానికి వచ్చినా వెంటనే అమ్మవద్దని, కొంతకాలం ఆగితే మరింత రేటు వస్తుందని నిర్మాత ఆనంద్‌ప్రసాద్‌కి పూరీ సలహా ఇచ్చాడని వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ చిత్రం స్టంపర్‌లో సరికొత్త బాలయ్య అద్భుతమైన ఎనర్జీతో ఎంతో స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా ఎన్నడూ లేనంతగా దాదాపు 10,15ఏళ్ల కంటే వయసు తక్కువగా బాలయ్య కనిపిస్తున్నాడని, ఆయన ఎనర్జీ అదిరిపోయే లెవల్‌లో ఉందని టాక్ వస్తోంది.
స్టంపర్ మేకింగ్ వీడియో కూడా మంచి ఊపులో కనిపిస్తోంది. ఇక ఈనెల 17న ఈ చిత్రం ఆడియో విడుదలైన వెంటనే బిజినెస్ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే నైజాంకు 7కోట్లకు, బాలయ్యకి ఎంతో పట్టున్నసీడెడ్‌లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు అయిన సాయికొర్రపాటి ఈ చిత్రం కోసం 8కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రా, ఓవర్‌సీస్, రెస్టాఫ్ ఇండియా నుంచి కూడా ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. ఈ డీల్స్‌ని ఆడియో వేడుక అనంతరం ఫైనల్ చేసే అవకాశాలున్నాయి.
బాలయ్య కెరీర్‌లోనే అత్యంత హయ్యస్ట్ బిజినెస్ చేసే చిత్రంగా 'పైసా వసూల్' నిలిచే అవకాశం ఉందంటున్నారు. మరి బాలయ్య ఈ చిత్రంతో 100కోట్ల క్లబ్‌లో ఏమైనా అడుగుపెడతాడా? లేక అది మరీ అత్యాశేనో అనేది త్వరలోనే తేలనుంది.