నేడే విడుదల అంటూ డ్రగ్స్ కేసులో నోటిసులు ఇచ్చి సినిమా సెలెబ్రటీస్ ని సిట్ అధికారులు విచారణకు పిలిచి గంటల తరబడి విచారించి మరీ మీడియాలో సెన్సేషన్ అయ్యారు. టాలీవుడ్ సెలబ్రిటీస్ ని సిట్ అధికారులు రకరకాల ప్రశ్నలతో డ్రగ్స్ కేసు కోసం విచారించారు. నోటీసులు అందుకున్న 12 మంది మీడియాలో సంచలనం అయ్యారు. ఆ 12 మందిని సిట్ అధికారులు కూడా కొంచెం హడావిడి చేస్తూనే సినిమాటిక్ తరహాలో ప్రశ్నించడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. కానీ... ఇండస్ట్రీలో పెద్దలనొదిలేసి పిల్ల చేపల్ని పట్టుకున్నారన్న ఆరోపణలు మాత్రమే కాదు నిజాలే అంటున్నారు కొంతమంది. ఇండస్ట్రీలో పెద్ద చేపల్ని వదిలేసి ఇలా చిన్న చేపల్ని ఇరికించి ఇబ్బందులు పెట్టారని... పోలిసుల మీద చాలా ఆరోపణలు ఉన్నాయి.
ఈ 12 మందిని సిట్ అధికారులు విచారణ జరుగుతున్నప్పుడుదే మరి కొంత మందితో సెకండ్ లిస్ట్ తయారవుతుందంటూ వార్తలొచ్చాయి. ఇంకేంటి ఎవరి పేర్లు బయటికి వస్తాయో అని సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు భయపడ్డప్పటికీ.... ఆ లిస్ట్ బయటికి రాదనే గాసిప్స్ సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. కేవలం అవి గాసిప్స్ కావని నిజంగానే సెకండ్ లిస్ట్ రావట్లేదని డ్రగ్స్ కేసులో చెలరేగిపోయి విచారణ చేసిన అకున్ సబర్వాల్ చెప్పకనే చెప్పేస్తున్నారు. ఏదో సెప్టెంబర్ లో సెకండ్ పార్ట్ ఉంటుందని చెబుతున్నప్పటికీ ఈసారి పేర్లు బయటపెట్టకుండానే విచారణ చేపడుతున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా విచారణ చేపట్టాలని... వారికి ఇబ్బదులు కలగకుండా తెలంగాణాని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేస్తానని ఆయన చెబుతున్నారు. కేసీఆర్ చెప్పినట్లుగానే సినిమా వాళ్ళని ఎంక్వరీ చెయ్యమని.. అకున్ సబర్వాల్ కూడా క్లారిటీ ఇచ్చాక ఇక సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు బయటికెలా వస్తారు చెప్పండి. ఎంక్వరీ ఉండదు గాని ఫోర్సినిక్ డిపార్ట్ మెంట్ నివేదిక ప్రకారం ఈ కేసులో ముందుకు వెళతామని సబర్వాల్ చెప్పడం... అది కూడా సెప్టెంబర్ లో అంటూ తాత్సారం చూస్తుంటే.. ఆయన గతంలో చెప్పినట్లు పెద్దలు పేర్లు బయటికి చెప్పకుండా ఒత్తిళ్లు ఉన్నమాట నిజమనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో రాకమానదు. దీనిబట్టి అకున్ సబర్వాల్ చెబుతున్నట్టు సెకండ్ రిలీజ్ మాత్రం సెప్టెంబర్ లో దాదాపు లేనట్టే అంటున్నారు.