యంగ్‌హీరో నాగశౌర్య కెరీర్ అనుకున్న వేగంగా సాగడం లేదు. తెలుగులో ఆయన నటించే చిత్రాలు ఎప్పుడు వస్తున్నాయో? ఎప్పుడు పోతున్నాయో తెలియదు. నాగశౌర్య సినిమా అంటే చాలు అందరూ ఆయన సినిమాని కూడా థియేటర్‌కి వెళ్లి వందలు పెట్టుకుని చూడాలా? టీవీ శాటిలైట్‌లో వచ్చినప్పుడు చూడవచ్చులే అనే దుస్థితిలో ఆయన కెరీర్ ఉంది. ఇక కొణిదెల హీరోయిన్ కూడా ఆయనను గట్టెక్కించలేకపోయింది.
ఇక లాభం లేదని భావించిన ఈ హీరో తానే నిర్మాతగా మారి హీరోగా నటిస్తూ, కన్నడలో 'కిర్రాక్ పార్టీ' తో సూపర్‌ఫామ్‌లో ఉన్న రష్మిక మండనాని తీసుకోవడంతో కాస్త చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. ఇక తన చిత్రాలు కేవలం తెలుగునే టార్గెట్ చేస్తే లాభం లేదని, ఇతర యంగ్ హీరోలైన కొందరిలాగే ఆయన ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడలో కూడా తీస్తున్నాడు. ఇక తమిళ, కన్నడ ప్రేక్షకులు హీరో స్టామినాని కాకుండా కొత్తదనం ఉంటే ఆదరిస్తారనే నమ్మకం ఉండటంతో ఆయన తానే నిర్మాత కూడా కావడంతో ఆర్దికపరంగా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక తెలుగులో ప్రేక్షకులను అలరించడానికి తాను, రష్మిక మండన్నలు ఉన్నామని, ఇక మండన్న వల్ల ఈ చిత్రానికి కన్నడలో కూడా క్రేజ్ వస్తుందని ఆలోచిస్తున్నాడు.
ఇక ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కావాలంటే రష్మిక మండన్నాతో పాటు ఓ తమిళ నటుడిని కూడా తీసుకుంటే తమిళంలో కాస్త అంచనాలు వస్తాయని ఆశపడుతోన్న ఆయన తమిళంలో సూర్య, లారెన్స్ చిత్రాలలో గుండుతో అలరించే కమెడియన్ రాజేంద్రన్‌ని పెట్టుకున్నాడు. ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్న నాగశౌర్యకి ఈ చిత్రం హీరోగా, నిర్మాతగా ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో వేచిచూడాల్సివుంది....!