కోలీవుడ్‌లో రసికుడు ఎవరంటే అందరూ ఠక్కున శింబు పేరే చెబుతారు. నయనతార నుండి ఇటీవల హన్సిక వరకు శింబు సినిమాలలో కంటే నిజజీవితంలోనే ఎక్కువగా వార్తల్లో ఉంటాడు. మల్టీటాలెంటెడ్ పర్సన్ అయినా ఈ హీరోగారి చిత్రాలు ఇటీవల ఏవీ సరిగా ఆడలేదు. శింబు లో ఓ కథకుడు, పాటగాడు, ఆటగాడు, దర్శకులు.. ఇలా ఎందరో ఉన్నారనేది తెలిసిన విషయమే. చిన్నప్పుటి నుంచి రజనీకాంత్‌కి పోటీగా అన్నట్లుగా శింబు లిటిల్‌సూపర్‌స్టార్ అనే బిరుదును తనకు తానే తగిలించుకున్నాడు.
ఇక శింబు నటించిన 'మన్మథ' చిత్రానికి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే అందించాడు. అలాగే తన దర్శకత్వంలో తానే హీరోగా, నయనతార హీరోయిన్‌గా 'వల్లభ' అనే చిత్రం తీశాడు. లిప్‌లాక్ సీన్లు, హాట్ హాట్ అందాలను నయనతార చేత ఆరబోయించినా ఆ చిత్రం ఆడలేదు. కాగా ప్రస్తుతం శింబు మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మొదట అందరూ ఈ చిత్రం తమిళంలో రూపొంది, ఇంగ్లీషులోకి అనువాదం చేస్తారని భావించారు. నా సినిమాలో సాంగ్స్, ఇంటర్వెల్‌లు ఉండవని చెప్పడంతో అందరూ అదే భావించారు. కానీ శింబు స్ట్రెయిట్‌గా కేవలం ఇంగ్లీషులోనే ఈ చిత్రం చేస్తున్నాడట. తర్వాత దీనిని తమిళంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో అనువాదం చేస్తానని చెప్పుకొచ్చాడు.
దీనికి గాను నెంబర్‌వన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్‌శివన్‌తో పాటు యువన్‌శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి శింబుకి ఎంతో సన్నిహితుడైన గౌతమ్ వాసుదేవ మీనన్ సంభాషణలు రాస్తున్నాడు. మరి గౌతమ్‌మీనన్ ఇంగ్లీషులో డైలాగ్ రాయడం అంటే కాస్త ఆసక్తిగానే ఉంది. మరోవైపు ఈ చిత్రం గురించి, ఇప్పటి నుంచే సంతోష్‌శివన్, యువన్‌శంకర్‌రాజా, గౌతమ్‌మీనన్‌లు చాలా పొగడ్తలు గుప్పిస్తున్నారు. మరి ఈ మల్టీ టాలెంటెడ్ హీరో తన ఆంగ్ల చిత్రంతో ప్రేక్షకులను ఏమేరకు ఎంటర్‌టైన్ చేస్తాడో చూడాలి! ఇదంతా బాగానే వుంది కానీ..ఎప్పుడైతే శింబు ఈ మూవీ గురించి చెప్పాడో..అప్పుడే శింబు పై నెగిటివ్ కామెంట్స్ కూడా పడుతుండటం విశేషం. ఇది తన పైత్యానికి పరాకాష్ట గా కోలీవుడ్ లో కొందరు వర్ణిస్తుండటం వింటుంటే..శింబు పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది.