Advertisementt

కాజల్ ఏదో ఆశిస్తే..అక్కడేదేదో అయ్యింది..!

Fri 11th Aug 2017 07:12 PM
kajal aggarwal,madras high court,vvd company  కాజల్ ఏదో ఆశిస్తే..అక్కడేదేదో అయ్యింది..!
Kajal Aggarwal Fined For Filing False Case In Madras Court కాజల్ ఏదో ఆశిస్తే..అక్కడేదేదో అయ్యింది..!
Advertisement

సినిమా ఛాన్స్‌ల కంటే యాడ్‌ల రూపంలో సెలబ్రిటీలు బాగా సంపాదిస్తున్నారు. అయితే అది అందరూ కాదండోయ్‌. పేరున్న పెద్ద సెలబ్రిటీలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇది వారికి అదనపు ఆదాయ వనరు. సినిమా కోసం నెలల పాటు కష్టపడితే వచ్చేది..రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. అలా అనే కాజల్‌ అగర్వాల్‌ ఆ మధ్య అంటే అప్పుడెప్పుడో 2008లో ఓ హెయిర్‌ ఆయిల్‌ యాడ్‌ చేసింది. 

ఆ టైమ్‌లో కోకోనట్‌ హెయిర్‌ ఆయిల్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసిన కాజల్‌, తన కాంట్రాక్ట్‌ ముగిసినా..తను నటించిన యాడ్‌ని వాడుతున్నారని కోర్టులో కేసు వేసింది. ఇది కరెక్ట్‌ కాదని, తన అనుమతి లేకుండా ఇంకా ఆ యాడ్‌ని వాడుతున్నందుకు తనకు తగిన పరిహారం చెల్లించాలని కోర్టు మెట్లెక్కిన కాజల్‌ ని కోకోనట్‌ ఆయిల్‌ గట్టిగా తిప్పి కొట్టింది. 

కాంట్రాక్ట్‌ ముగిసినా కాపీ రైట్స్‌ చట్టం క్రింద ఆ యాడ్‌ను 60 ఏళ్ల పాటు వాడుకోవచ్చని కోకోనట్‌ ఆయిల్‌ తరపు న్యాయవాది వాదించడంతో..కాజల్‌ వాదనలో బలం లేదని కేసుని విచారించిన మద్రాస్‌ హైకోర్టు ..ఈ కేసుని కొట్టివేసింది. దీంతో కాజల్‌కి ఏం పోయింది అనుకుంటున్నారు కదా..! ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. ఈ కేసుకు సంబంధించి సదరు కంపెనీ భరించిన ఖర్చులన్నీ కాజలే కట్టాలని ఓ మొట్టికాయ కూడా వేసిందని టాక్‌. 

Kajal Aggarwal Fined For Filing False Case In Madras Court:

South Indian actress Kajal Agarwal has suffered a setback in the Madras High Court after a suit filed by her in a copyright related case was dismissed by the court.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement